కొత్త బాలయ్యను చూస్తారంటున్న పూరీ

Blayya will look differently in NBK101 says Director Puri Jagannadh

Blayya will look differently in NBK101 says Director Puri Jagannadh

 

ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది పూరీ – బాలయ్య చేస్తున్న సినిమానే. అట్టహాసంగా పూజా కార్యక్రమాలు జరుపుకొని ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలక‌ృష్ణ 101వ సినిమాలో చాలా కొత్తగా కనిపించనున్నాడట. పూరీ మార్క్ ఉండేలా అతని హీరోలు ఎలాగైతే స్టైలిష్‌గా గ్రూమ్ అయి కనిపిస్తారో బాలయ్యని కూడా అలానే తీర్చిదిద్దారట పూరీ. ఫస్ట్ షెడ్యూల్‌లో కొత్త లుక్‌, కొత్త స్టైల్ బాలయ్యకు కూడా చాలా బాగా నచ్చిందని సంతోషపడుతున్నాడు పూరీ జగన్నాథ్.

అసలు ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని అందరూ అనుకుంటున్నప్పడే చాలామంది సందేహాలు బయటపెట్టారు. బాలయ్య సినిమాల్లో రొటీన్‌గా ఉండే పొలిటికల్ డైలాగ్స్, పంచ్‌లు , పూరీ సినిమాల్లో ఉండే రఫ్ క్యారెక్టర్, పంచ్‌డైలాగ్స్‌కి మధ్య ఎలా వర్కౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ సైతం పూర్తి చేసుకొని అందరూ చాలా సంతోషంగా ఉన్నారట.

అయితే ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని… నూటికి నూరు పాళ్లు తన మార్క్ హీరోయిజం ఉంటుందని వెల్లడించాడు. అంతేగాక  ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లను తీసుకోవాలని అనుకున్ఫినారట. అందులో ముస్కాన్ అనే ఒక హీరోయిన్‌ను ఫైనలైజ్ చేశామని అయితే ఈ సినిమాలో పొలిటికల్ పంచ్ లు మాత్రం  ఉండవని, కేవలం తన మార్క్ డైలాగ్స్, పంచ్ లు మాత్రమే ఉంటాయని పూరీ క్లారిటీ ఇచ్చాడు. అంతేగాక బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ సన్నీ లియోనీ స్పెషల్ డ్యాన్స్ చేయనుందని కన్ఫార్మ్ చేశాడు పూరీ.

 

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.