రాజీనామా ఆమోదం – మాయావతి ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నాయా??

BSP Chief Mayavathi resignation accepted and more political plans to come out

అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. పెద్దల సభలో కూర్చొని దేశ రాజకీయాలను శాసించడం ఇబ్బంది అనుకున్న మాయావతి లేటెస్ట్‌గా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. మరో ఆరు నెలల్లో ఆమె పదవీకాలమే ముగుస్తున్న సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది తప్పుబట్టినప్పటికీ పెద్దలసభ ఈరోజు ఆమె రాజీనామాను ఆమోదించేసింది.

BSP Chief Mayavathi resignation accepted and more political plans to come out

రాజ్యసభలో దళితుల అంశంపై మాట్లాడేందుకు తనకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మాయావతి తన ఎంపీ పదవికి రాజీనామా చేసారు. ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌పూర్‌లో దళితులపై దాడి అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తేందుకు మాయావతి ప్రయత్నించగా.. సభాపతి అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన మాయావతి రాజీనామా చేశారు. దళితులకు సంబంధించి కేంద్రంలోని మోడీ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మొత్తం దళిత వర్గాలకుయ సంకేతాలు వెళ్ళే విధంగా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆమె రాజీనామా చేశారు. అయితే రాజీనామాను వెనక్కి తీసుకోవాలని అన్ని పార్టీల నాయకులు కోరినప్పటికీ ఆమె మనసులో వేరే ప్లాన్స్ వర్కౌట్ చేయాలని ఉన్నందునే ఒప్పుకోలేదని పరిశీలకు భావిస్తున్నారు.

గత కొంతకాలంగా ఎన్నికల్లో వరుస ఎదురు దెబ్బలతో కాస్తా వెనుకబడినట్టు కనిపించిన మాయావతి దేశ రాజకీయాల్లో మళ్ళీ కీలకంగా మారే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులోభాగంగా దేశంలోని బీజేపీయేతర ప్రతిపక్షాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి నడిపించే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా పెద్దలో సభలో ఉండడంకంటే ప్రజల్లో గెలిచి లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకోవడం ద్వారా మళ్లీ రాజకీయంగా తన సత్తా ఏమిటో చాటాలని భావిస్తున్నారు మాయావతి.

See Also: టార్గెట్ వెంకయ్యనాయుడు: ఏపీలో ఇక వికసించే కమలాన్ని అడ్డుకొనేదెవరు??

ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్‌ మౌర్య రాజీనామా చేస్తే అలహాబాద్‌కు సమీపంలోని ఫూల్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు రానున్నాయి. అప్పుడు ఆ లోక్‌సభ స్థానం  నుంచి ఆమె పోటీచేయాలని భావిస్తున్నారని సమాచారం. లోక్‌సభ సభ్యులుగా ఉన్న  సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం మౌర్య తమ స్థానాలకు రాజీనామా చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారు ఆగిపోయారు. ఆరు నెలల్లోగా ఈ ఇద్దరూ ఎంపీ స్థానాలకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది.

ఈ ప్లాన్‌లో భాగంగానే మాయావతి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారని… ఇప్పుడు మాయావతి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయిస్తే మాత్రం 2019 ఎన్నికలకు ముందు అది పెద్ద రాజకీయ మార్పుకు కారణం అవడం మాత్రం ఖాయం.

See Also: టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

దళిత, మైనారిటీ, వెనుకబడిన తరగతుల ఓటర్లు అధికం. కాబట్టి ఇక్కడి నుంచే బీఎస్పీ పునర్‌వైభవానికి మాయావతి పునాది వేయాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ఫూల్‌పూర్‌ నియోజకవర్గం నుండి దేశ ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ సహా అనేకమంది ప్రముఖ నేతలు పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టడంతో ఈ నియోజకవర్గంలో విజయమంటే జాతీయంగా ప్రాముఖ్యత ఉంటుందని మాయావతి భావిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.