సుప్రీం తీర్పుతో జైలుకి వెళ్తున్న మొదటి జడ్జి జస్టిస్ కర్ణన్

calcutta-high-court-judge-justice-cs-karnan-is-first-judge-to-be-sentenced-to-prison-by-supreme-court

calcutta-high-court-judge-justice-cs-karnan-is-first-judge-to-be-sentenced-to-prison-by-supreme-court

గత కొన్ని రోజులుగా వివాదాస్పద నిర్ణయాలతో దేశంలో ఒక ఊపు ఊపిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ కర్ణన్‌ వివాదం మరో మలుపు తిరిగింది. అసలు ఏం జరిగిందంటే, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలను విమర్శిస్తూ జస్టిస్‌ కర్ణన్  రాసిన వరుస లేఖలపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయి ధిక్కార కేసు నమోదు చేయడానికి సిద్ధపడింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌, మరో ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఒక బెంచ్ ఏర్పాటు చేసి జస్టిస్ కర్ణన్‌‌ను విచారణకు హాజరువకావాల్సిందిగా ఆదేశించారు. దీనిపై సీరియస్ అయిన జస్టిస్ కర్ణన్ సీజేతో పాటు మరో ఏడుగురు సుప్రీం న్యాయమూర్తులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడ్డారంటూ ఈ ఎనిమిదిమందికి అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.

అంతేగాక కోర్టు ఉత్తర్వులను అమలుపరచాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. కేసులో బాధితుడిగా ఉన్న వ్యక్తికి(అంటే కర్ణన్‌కు) చెల్లించాల్సిన 14 కోట్ల రూపాయలు పరిహారం ఇంకా అందలేదని, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆ డబ్బును జడ్జిల వేతనాల్లో నుంచి తీసుకుని అకౌంట్‌లో వేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు.కర్ణన్ సంచలన తీర్పుతో ఒక్కసారిగా న్యాయవ్యవస్ధ షాక్‌కు గురైంది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు …ఆయన వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టు ధిక్కరణ నేరం కింద కర్ణన్‌కు ఆరు నెలలు పాటు జైలుశిక్ష విధించింది.

తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్‌ కర్ణన్‌ను విచారించారు. విచారణ తర్వాత జడ్జిలతో ఉన్న బెంచ్‌ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్‌ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించారు.

న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఆయన్ని ఈరోజు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. జస్టిస్‌ కర్ణన్‌‌ కోర్టు థిక్కరణకు పాల్పడ్డారంటూ జైలుశిక్ష విధించింది సుప్రీంకోర్టు. దీంతో సుప్రీంకోర్టు చేతిలో జైలుశిక్ష పడ్డ మొదటి జడ్జిగా జస్టిస్‌ కర్ణన్ నిలిచారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.