ఒక్క నిమిషం ఆలోచిద్దామా??

Can you spare one minute for reading this Cricket and Farmers??

ప్రస్తుతం మనం ఎలా తయారయ్యామో ఒక క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మన వ్యవహారశైలి ఎలా ఉంటుందో చూస్తే చాలా సులభంగా అర్థమౌతోంది. క్రికెట్‌ అనేది దేశభక్తికి సంబంధించిన విషయం ఏమాత్రం కాదని, అసలైన దేశభక్తికి క్రికెట్‌కు ఏమాత్రం సంబంధంలేదని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే దేశం బాగుపడుతుందనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Can you spare one minute for reading this Cricket and Farmers??

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తులారా…. ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా…. ఒక్కసారి ఆలోచించండి…

• దేశానికి అన్నంపెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా?
• ఇష్టమయిన క్రికేటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా?
• రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే, నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్నకే పేరు పెడుతావ్?
• దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే, టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్. దేశాన్ని బతికించే నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ అనే ఆందోళన నీకుందా?
• నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్. నిన్ను బతికించే రైతులకెవరూ ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా?
• నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా?
• ఇండియన్ క్రికెట్ బోర్డో, క్రికెట్ టీమో చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్. వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశంలో ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్నిఅసలెప్పుడయినా పట్టించుకున్నావా?

See Also: అయ్యో రైతన్నా…

 

• ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన నీకు, రోజూ ఎక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా?
• అసలు, అసలైన పరుగులు తియ్యడం అంటే ఏమిటో నీకు తెలుసా?
• ఎప్పుడయినా, గిట్టు బాటు ధరలకోసమో, విద్యుత్తుకోసమో పోరాటం చేస్తా, లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా?
• ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు, దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా?
• పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు, చెక్కతో బ్యాట్ మాత్రమే కాదు నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని ఎప్పుడయినా పొలాలకు తీసుకెళ్ళి చెప్పావా?

See Also: చంద్ర’బాబా’ మజాకా???

 

• పిల్లలు తాగే పాలు, మజ్జిగ, వెన్న నిచ్చే జంతువులను రైతులు పెంచుతున్న విషయం నీ పిల్లలకు చెప్పావా?
• క్రికేటర్లు బూస్టు, కూల్ డ్రింకులు తాగి ఆరోగ్యంగా ఆడుతున్నారని, నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా?
• కామెంట్రీలు వింటూ టీవీలకు అతుక్కుపోయినట్లు రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనా చూసావా?
• ఎప్పుడు ఎలా ఆడితే దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో చెప్పగలవ్ కదా! మరి ఎప్పుడు ఎలా దేశం ఆహార పంటల విషయంలో గెలుస్తుందో చెప్పలేవా?
• పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం. కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం?
• ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా బతికించే వాళ్ళ గురించి ఆలోచించు.
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు పచ్చని పోలాల్లో. అందుకు రైతులు నాటౌట్ గా నిలవాలి. మనం చీర్ లీడర్స్ కావాలి, మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి.

“అన్నదాత సుఖీభవ”

Source: Social Media

Have something to add? Share it in the comments

Your email address will not be published.