ఆరోపణలతో ఐటీ కమిషనర్‌ అరెస్టు

CBI arrested Income tax commissioner in Mumbai on allegations in graft case

CBI arrested Income tax commissioner in Mumbai on allegations in graft case

భారీ లంచం తీసుకుంటున్న ఆరోపణలతో సీబీఐ ఓ పెద్ద అవినీతి తిమింగలాన్ని వల వేసి పట్టేసింది.  ఓ బడా కార్పొరేట్ సంస్థకు మేలు చేసేందుకు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నట్లు కచ్చితమైన సమాచారం రావడంతో ముంబై ఆదాయపన్ను శాఖలో అప్పీళ్ల విభాగంలో కమిషనర్‌గా పనిచేస్తున్న బీబీ రాజేంద్ర ప్రసాద్ కార్యాలయం మీద దాడి చేసిన సీబీఐ అధికారులు.. రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు.

అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరి నుండి 1.5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం డీల్ ఇంతకంటే చాలా ఎక్కువగా ఉందని, దొరికింది మొత్తం సొమ్ములో కొంతేనని అంటున్నారు. లంచాల కేసులను సీబీఐ పట్టుకోవడం కొత్తేమీ కాదు గానీ, ఇంత పెద్ద మొత్తంలో.. అది కూడా ఆదాయపన్ను శాఖ అధికారినే పట్టుకోవడం మాత్రం విశేషమే అంటున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.