జగన్‌కు మొట్టికాయలు

CBI Court Judge fires on YS Jagan for not attending Court proceedings

వైఎస్సాఆర్సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి న్యాయమూర్తితో మొట్టికాయలు పడ్డాయి. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

CBI Court Judge fires on YS Jagan for not attending Court proceedings

అయితే ఈరోజు జగన్ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన విచారణకు ఎందుకు హాజరుకాలేదని సీబీఐ కోర్టు జడ్జి జగన్ తరుపు న్యాయవాదులను నిలదీశారు. ఆయనతోపాటు ఈ కేసులో ఎ1గా ఉన్న జగన్‌తో పాటు ఎ2  విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన జడ్జి వాళ్ళిద్దరు ఎందుకు రాలేదని జగన్ తరుపు న్యాయవాదులను నిలదీశారు.

See Also: మన ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు??

అయితే గుంటూరులో పార్టీ ప్లీనరీ ఉన్నందువల్ల కోర్టుకు హాజరుకాలేకపోయారని న్యాయవాదులు జడ్జికి వివరించారు. కానీ రాజకీయ కారణాలను చూపిస్తూ విచారణకు గైర్హజరుకావడాన్ని తప్పుబట్టిన న్యాయమూర్తి వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోసారి ఇలా చేస్తే వారంటు జారీ చేస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం.

See Also: జగన్ కు ఊరట: బెయిలు రద్దుకు నిరాకరించిన కోర్టు

Have something to add? Share it in the comments

Your email address will not be published.