టీడీపీ ఎమ్మెల్సీ వీఎన్ఆర్‌పై సీబీఐ దాడులు

CBI officials raids TDP MLC Vakati Narayan Reddy houses in 7 different cities

CBI officials raids TDP MLC Vakati Narayan Reddy houses in 7 different cities

అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీపై సీబీఐ దాడులకు దిగింది. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈమధ్యనే టిడిపి నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన వీఎన్ఆర్‌పై గతేడాది చీటింగ్ కేసు సహా మరికొన్ని కేసులు నమోదయ్యాయి.

వీఎన్ఆర్‌ ఇన్‌ఫ్రాతో పాటు వేరే ఇతర కంపెనీల పేరుతో నారాయణరెడ్డి సుమారు  450 కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకుని, డీఫాల్టర్‌గా మారడంతో బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. అయితే అవి బ్యాంకులకు తిరిగి రావడంతో మారిన చిరునామాకు కూడా నోటీసులు పంపాయి బ్యాంకులు. అంతేగాక ఆస్తులు వేలం వేయనున్నట్లు పత్రికల్లో భారీగా ప్రకటనలు సైతం ఇచ్చాయి. అయనప్పటికీ ఎలాంటి మార్పు కనిపించకపోయేసరికి లేటెస్ట్‌గా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగి దాడులు చేసింది.

హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరుల్లో ఒకే సమయంలో సీబీఐ దాడులు జరిగాయి. మే 3తేదీన ఆదాయపన్ను శాఖ అధికారులు నారాయణరెడ్డి ఇళ్లపై దాడులు చేసి, అసలు విషయాన్ని కనుక్కొనేందుకు దర్యాప్తు చేశారు. అయితే ఆ తర్వాత ఈరోజు నెల్లూరు చేరుకుని వేదాయపాళెంలో ఉన్న ఇంట్లో సోదాలు చేసి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.