లాలూకి తప్పని సీబీఐ దాడులు

CBI raids in 12 places of RJD Chief Lalu Yadav in Hotel lease scam

రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అవకతవకలకు పాల్పడ్డారని, లాలూ నివాసంతో పాటు దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో సీఐబీ  సోదాలు చేసింది. హోటళ్ల లీజు విషయంలో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌పైనా సీబీఐ కేసు నమోదు చేసింది.

CBI raids in 12 places of RJD Chief Lalu Yadav in Hotel lease scam

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో సీబీఐ తనిఖీలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 2006లో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఓ ప్రైవేటు సంస్థకు టెండర్ల కేటాయింపు అవకతవకలపై నమోదు చేసిన సీబీఐ.. ఇవాళ సోదాలు చేపట్టింది. 2006లో రాంచీ, పూరిలోని హోటళ్ల టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీ, పాట్నా, రాంచీ, పూరి, గుడ్‌గావ్ సహా 12 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తుంది.లాలూ ప్రవేట్‌ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని, హోటళ్ల టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. హోటళ్లను ఎక్స్చేంజ్‌ చేయడం కోసం ఈ హాస్పిటాలిటీ గ్రూప్‌ పాట్నాలోని రెండు ఎకరాల విలువైన భూమిని లాలూ సంస్థలకు లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.

See Also: కొనసాగుతున్న సీబీఐ దాడులు

మరోవైపు సీబీఐ దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శిలకు ఫోన్ చేసిన ఆయన అత్యవసరంగా రాజ్‌గిరి రావాలని ఆదేశించారు. అలాగే సొంత పార్టీ జేడీయూ నేతలకూ నితీష్ వర్తమానం పంపినట్లు సమాచారం. లాలూ కుటుంబ సభ్యులపై సీబీఐ కేసుల నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించడానికి ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

CBI Deputy Director Rakesh Asthana

సీబీఐ తనిఖీలు, తేజస్వీ  యాదవ్‌పై చర్యల విషయాన్ని ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. కాగా  బిహార్‌లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ, సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. లాలూ కుటుంబీకులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, సీబీఐ, ఈడీ కేసులు పెరిగిపోవడం నితీష్‌ కుమార్‌కు ఇబ్బందిగా మారింది. అవినీతి మరక తన ప్రభుత్వంపై పడుతుందనే ఆందోళన నితీష్‌లో కనిపిస్తోంది.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

అయితే బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లో సీబీఐ సోదాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా సీబీఐ సోదాల వెనుక కేంద్రం, భాజపా ప్రమేయం లేదని వెంకయ్యనాయుడు తెలిపారు. చట్టం ప్రకారమే సీబీఐ తన విధులు నిర్వర్తించి.. తనిఖీలు చేపట్టిందన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.