రైల్వే టికెట్ల ‘మోత’కు రెడీ

Central Cabinet approves setting up rail regulator to recommend hike in passenger fares

Central Cabinet approves setting up rail regulator to recommend hike in passenger fares

దేశవాసులకు కేంద్రప్రభుత్వం చేదువార్త వినిపించడానికి రెడీ అవుతోంది. రైల్వే శాఖలో సంస్కరణలకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రాబోయే కొన్ని నెలల్లో రైల్వే టికెట్ల ధరలు ఓ రేంజ్‌లో పెరగనున్నాయి.  ప్రయాణానికి అయ్యే ఖర్చు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని చార్జీలను నిర్ణయించే రైల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఓకె చెప్పేసింది. 1989 రైల్వే చట్టం పరిధిలోనే ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ సంస్థ ఏర్పాటుకు 50 కోట్లరూపాయల నిధులు కేటాయించింది కేంద్రం.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మనదేశంలో ఉన్నట్లు ఎక్కడా అంత తక్కువ రైల్వే ఛార్జీలు వసూలు చేయట్లేదట. ప్రయాణికులు చెల్లించే చార్జీలకు మనదేశంలో భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తోంది రైల్వేశాఖ. ప్రతీయేడాది ఈ సబ్సిడీల వల్లసుమారు 30వేల కోట్ల రూపాయలు నష్టం వస్తోందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. దీనికోసం రైల్వే టికెట్ల ధరలను పెంచడం తప్ప మరో మార్గమేమీలేదని కుేంద్రం భావిస్తోంది.

రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ వల్ల ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రైవేటు పెట్టుబడిదారుల విషయంలో విధానాలు మారకూడదనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారు. అంతేగాక అథారిటీ వల్ల రైల్వే శాఖ రైల్వేలో పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగపడే సంస్కరణ అవుతుందని అధికారులు అంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.