గోవధపై దేశవ్యాప్తంగా నిషేధం

Centre restricts cattle trade and bans sale of cows for slaughter

Centre restricts cattle trade and bans sale of cows for slaughter

ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన మూడో సంవత్సరం పూర్తయిన రోజున దేశ ప్రజలకు తీపి కబురు అందించారు. ఎప్పటినుండో అమలుకు నోచుకోని గోవధ నిషేదానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఎప్పటినుండో హిందూ ధర్మ సంరక్షణావాదులు కోరుతున్న గోవధపై నిషేదానికి మోక్షం లభించింది. ప‌శువ‌ధ‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక గోవుల అమ్మ‌కాల‌పై కూడా కొన్ని నియంత్ర‌ణ‌లు విధించింది.

పశు విక్రయశాలలపై ఆంక్షలు విధించిన కేంద్రం కొత్త నిబంధ‌న‌లను తయారు చేసింది. వాటి ప్ర‌కారం ప‌శువుల‌ను కేవ‌లం వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్త‌మే అమ్మడానికి తీసుకొచ్చామ‌ని, వాటిని ప‌శువ‌ధశాల‌ల‌కు అమ్మ‌డం లేద‌ని రైతులు లిఖిత‌పూర్వ‌కంగా రాసిస్తేనే వాటిని ప‌శువుల మార్కెట్‌లో అమ్మ‌కానికి అనుమ‌తినిస్తారు. అలా రాసి ఇవ్వకుండా అమ్మే ప్రయత్నం చేస్తే చట్టరీత్యా శిక్షార్హులౌతారని పేర్కొంది. అంతేగాక రైతులు రాసిచ్చిన లిఖితపూర్వక హామీని ప‌శువుల మార్కెట్ క‌మిటీ ఆమోదించాల్సి ఉంటుంది. అలా ఆమోదించిన తర్వాత అమ్మకానికి ఉన్న ప‌శువుల‌ను కొనుగోలు చేసేది కూడా ఒక రైతేన‌ని అత‌ని ద‌గ్గ‌ర ఉండే ప‌త్రాల‌ను చూసి అధికారులు ధృవీక‌రిస్తారు. ఆ తర్వాత కూడా గోవులను కొనుక్కున్న తర్వాత వాటిని కబేళాలలకు అమ్మ‌బోన‌ని లేదా వాటిని ఏ మ‌త విశ్వాసాల‌కు అనుగుణంగా బ‌లి ఇవ్వ‌బోన‌న్న హామీ ఇవ్వాల్సి ఉంటుంద‌ి.

రాష్ట్రాలకు చెందిన వ్య‌క్తులు అనుమ‌తి లేకుండా ప‌శువుల‌ను కొనుగోలు చేయ‌డంపై కూడా నిషేధం విధించింది కేంద్రం. వీలికితోడు రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌కు 25 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ప‌శువుల మార్కెట్లు ఉండ‌కూడ‌ద‌ని, ఇక గోశాల‌లు, ఇత‌ర ప‌శుసంర‌క్ష‌ణ శాల‌లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ప‌శువుల‌ను ద‌త్త‌త‌కు ఇచ్చే ముందు కూడా వాటిని ప‌శువ‌ధ‌శాల‌ల‌కు అమ్మ‌డం లేద‌ని రాసివ్వాల్సి ఉంటుందని స్పష్టంగా తేల్చిచెప్పింది.  అంతేగాక ప్రతీ పశువుకి  ఆధార్‌లాంటి ఒక గుర్తింపు కార్డు ఉంటుందని పేర్కొంది.

అయితే కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్నిపలువురు ఖండిస్తున్నారు. ప్రస్తుతం భారత్ నుంచి ఏటా లక్ష కోట్ల పశు మాంసం ఎగుమతి అవుతోంది. పశువుల మాంసం ఎగుమతి చేసే రాష్ట్రాల్లో ముందున్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్ కాగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తెలంగాణా రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 90శాతం మాంసాన్ని రైతుల దగ్గరి నుండి కొన్ని పశువుల నుంచే తయారీ చేస్తున్నారు. వీటికితోడు ముసలి పశువులను కూడా విక్రయించడానికి వీల్లేదని గెజిట్‌లో పేర్కొంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Vijayasree says:

    Gomata samrakshana sarva prani samrakshana