పాతబస్తీలో పోలీసుల చబుత్రా మిషన్

chabruta mission in hyderabad old city

 

హైదరాబాద్ పాతబస్తీలో చబుత్రా మిషన్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించారు.  నగరంలోని 17 పోలీసు స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 1:30 నుంచి తెల్లవారుజాము 4:00 గంటల వరకు చబుత్రా ఆపరేషన్ నిర్వహించారు.

chabruta mission in hyderabad old city

యువతుల్ని వెంబడించడం, దాడులు చేయడం, మద్యం తాగి అల్లరి చేయడం, కొట్లాటలకు దిగడం లాంటి సంఘటనలు జరుగుతుండటంతో పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు బృందాలు పాతబస్తీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తెల్లవారితే పరీక్ష ఉన్నప్పటికీ, కొందరు విద్యార్థులు బైకులపై తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులను వెంటనే విడిచిపెట్టారు.

సుమారు 162 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న బైకులను స్వాధీనం చేసుకున్నారు.. పట్టుబడ్డ కుర్రాళ్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఫలక్ నుమా మొగల్ ఫంక్షన్ హాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ, అడీషనల్ డీసీపి బాబూరావు ఆధ్వర్యంలో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు..

Have something to add? Share it in the comments

Your email address will not be published.