అతి విశ్వాసమే కొంపముంచిందా???

Champions Trophy 2017 Final Rival Pakistan trashes India by 180 runs

అంచనాలు ఎక్కువై, పక్కనోడిని తక్కువ అంచనావేసిన దానికి ప్రతిఫలం చెల్లించకోకతప్పదు. అది ఆట అయినా, జీవితం అయినా… మనపై మనకు నమ్మకం ఉండడం మంచిదేకానీ, పక్కనోడిని మరీ దారుణంగా తక్కువ అంచనా వేసి బొక్కబోర్లాపడేవాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో వచ్చి చేరింది భారత క్రికెట్ జట్టు.

Champions Trophy 2017 Final Rival Pakistan trashes India by 180 runs

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడ్డ భారతజట్టు దేశప్రజల ఆశలపై నీళ్ళు పోసేసింది. భారత్‌కు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తొలిసారి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. కోహ్లీసేనపై ఓటమితో టోర్నీ మొదలుపెట్టిన సర్ఫరాజ్‌ టీమ్‌ చివరి ఆటలో గెలుపుతోనే తమ జర్నీముగించింది.

టాస్ గెలిచి పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన విరాట్‌ కోహ్లీ తను తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద తప్పో ఓడిన తర్వాత తెలుసున్నాడు.  బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ సహా అన్నింటిలో తమ సత్తా ఏంటో చూపించి టీమిండియాపై 180 పరుగుల తేడాతో గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో ఓడిపోయిన పాక్‌ ఫైనల్‌ లో తన జూలు విదిల్చింది. భారత బౌలింగ్‌ను ఏమాత్రం లెక్కచేయకుండా బ్యాట్‌కు పనిచెప్పి బౌండరీల మోత మోగించారు. పొడిపిచ్‌పై బంతులు వేసేందుకు ఇబ్బందులు పడ్డ స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్‌లో పాక్‌ ఓపెనర్లు ఫకర్‌ జమాన్‌ (114; 106 బంతుల్లో 12×4, 3×6), అజార్‌ అలీ (59; 71 బంతుల్లో 6×4, 1×6) చుక్కలు చూపించారు.దీంతో పాకిస్తాన్‌ ఆటగాళ్ళు కోహ్లీసేనకు 339 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించి సవాల్‌ విసిరారు.

సర్ఫరాజ్ టీం ఇచ్చిన సవాల్‌ను స్వీకరించిన టీమిండియా మొదటి ఓవర్లోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. 339 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడింది. 54 పరుగుల్లోపే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది. కాస్త నిలకడగా ఆడుతూ ఆదుకుంటాడనుకొన్న యువరాజ్‌సింగ్‌ (22; 31 బంతుల్లో 4×4) పెవిలియన్‌‌కు చేరడంతో కోహ్లీ టీం ఆశలు వదిలేసుకుంది. ఆ తర్వాత లక్ష్యచేధనలో తడబడ్డ భారత జట్టు 30.3 ఓవర్లకు 158 పరుగులకు కుప్పకూలింది. హార్దిక్‌పాండ్యా (76; 43 బంతుల్లో 4×4) భారత్‌ తరుపున టాప్‌ స్కోరర్‌‌గా నిలిచింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017 ఫైనల్లో భారత జట్టు గెలవాలని అభిమానులు చేసిన ప్రార్థనలు, హోమాలు, ప్రత్యేక పూజలు అన్నీ బురదలో పోసిన పన్నీరు అయ్యింది. అసలు పోరాటమనే విషయాన్నే మరిచిన భారత జట్టు 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.