విబేధాలు సర్దుతున్న చంద్రబాబు

chandra-babu-constituted-three-men-committee-for-party-discipline

విశాఖ జిల్లాలోని ఇద్దరు అమాత్యుల మధ్య నెలకొన్న విబేధాలను చక్కదిద్దే పనిలో పడ్డారు ఎపి సీఎం చంద్రబాబు. పార్టీ సీనియర్లు ఇద్దరు ఏవైనా ఇబ్బందులుంటే పార్టీ నాయకత్వానికి చెప్పకుండా అనవసరంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేసి పార్టీ పరువు తీస్తున్నారని భావించిన బాబు  విశాఖలో పార్టీ విభేదాలపై త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు.

chandra-babu-constituted-three-men-committee-for-party-discipline

కాగా.. తనపై రోడ్లు భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. ఆయన వల్ల ఆర్థిక రాజధాని విశాఖ పరువు పోతోందని లేఖలో పేర్కొన్నారు. నిజానికి వీరిరువురి నడుమ చాలా కాలంగా విభేదాలున్నాయి.

సీఎం చంద్రబాబు నివాసంలో రెండు గంటలపాటు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. పార్టీలో సమన్వయం లేదని ప్రచారం జరుగుతోందంటూ ఆగ్రహానికి లోనైన చంద్రబాబు ఈ సమావేశంలో నంద్యాల ఉప ఎన్నిక, విజయవాడ అరుణాచల్‌ బస్సుల వివాదం, విశాఖ ఘటనలపై అసహనం వ్యక్తం చేశారు. అంతేగాక భూ కుంభకోణం వ్యవహారంపై మంత్రులు గంటా- అయ్యన్నలతో ప్రత్యేకంగా మాట్లాడతానని చంద్రబాబు సభ్యులకు తెలిపారు.

ఎవరికైనా ఏమైనా సమస్యలుంటే పార్టీ వేదికలపైనే మాట్లాడాలి తప్ప బహిరంగంగా మాట్లాడడం మంచిదికాదని మంత్రులకు చంద్రబాబు సూచించారు. అంతేగాక ఎంతటివారికైనా తప్పు చేస్తే  శిక్ష తప్పదని సీఎం ఖరాకండిగా చెప్పారట. ఇద్దరు మంత్రులను బయటికి పంపించి విషయాన్ని ఇతర మంత్రులనుండి అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేశారు చంద్రబాబు. వీటికితోడు మంత్రి అయ్యన్న సింగపూర్ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన వెంటనే ఇద్దరు మంత్రులను కూర్చోబెట్టి సీఎం మరోసారి క్లాస్ తీసుకొనే ఆలోచనలో ఉన్నారు.

మరోవైపు భూ కుంభకోణంలోభాగంగా హైదరాబాద్‌లో అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీనుండి సన్సెన్షన్ చేస్తూ టీడీపీ సయన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.