అండగా నిలబడ్డ చంద్రబాబు

Chandra babu decides to give Group 2 post to Lakshmi prasanna

వారం క్రితం అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో ఒక అమ్మాయి వేదన విని ఆమెకు అండగా నిలుస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటపైన నిలబడ్డారు. తన తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువుల్ని కోల్పోయిన అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని  చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Chandra babu decides to give Group 2 post to Lakshmi prasanna

ముక్తాపురంలో జూలై 5న జరిగిన గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు  20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన బాబు ఆమెకు అండగా నిలుస్తామంటూ ధైర్యం చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి  సూచన మేరకు అనంతపురం జిల్లాకు చెందిన జెసి సోదరులు లక్ష్మీప్రసన్నను వెలగపూడిలోని సచివాలయానికి తీసుకువచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నతో మాట్లాడిన చంద్రబాబు ఆమె విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు.

See Also: గాంధీ మనవడినే రంగంలో దింపారు

అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని చంద్రబాబు లక్ష్మీ ప్రసన్నకు సూచించారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని, ఉద్యోగం వచ్చినా ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అంతేగాక ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చదివానని చెప్పిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి నిర్ణయించారు.

See Also: టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.