టీడీపీ నుండి ఎమ్మెల్సీ వాకాటి ఔట్

CBI officials raids TDP MLC Vakati Narayan Reddy houses in 7 different cities

CBI officials raids TDP MLC Vakati Narayan Reddy houses in 7 different cities

అక్రమ ఆస్తుల కేసులో సిబిఐకి దొరికిన ఆంధ్రప్రదేశ్ టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వివిధ బ్యాంకులకు 450 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న వాకాటి నారాయణరెడ్డి విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా అనే విషయం గురించి దర్యాప్తు చేసేందుకే సీబీఐ ఈ సోదాలు చేసింది. సీబీఐ సోదాలు చేయడం, బ్యాంకులకు భారీగా బకాయిలు ఉన్న విషయం మరోసారి బయటకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎపి ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడంతోపాటు ఇద్దరు భేటీకావడంతో తెలుగు తమ్ముళ్ళలో అసహనం మొదలైంది. అదే సమయంలో వాకాటిపై సీబీఐ దాడులు చేయడంతో సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డ టీడీపీ తమకు వీఎన్‌ఆర్‌కు ఎలాంటి సంబంధంలేదని చూపించుకోవడానికే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు అనేకమంది టీడీపీ నాయకులపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలలు తీసుకోని చంద్రబాబు ఈసారి మాత్రం తమ తప్పులేదని నిరూపించుకొనే పనిలో పడ్డారు.

ఆర్థిక ఆరోప‌ణ‌లు, సీబీఐ కేసుల దృష్ట్యా ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు వివ‌రించిన చంద్ర‌బాబు  దేనికైనా ఓ పద్ధతి ఉండాలని, పార్టీలో ఎవ్వరు తప్పు చేసినా సస్పెండ్ చేస్తామని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.