అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్

Chandrababu adviced Tourism Minister Bhooma Akhilapriya to become strong in the department

Chandrababu adviced Tourism Minister Bhooma Akhilapriya to become strong in the department

మంత్రివర్గ విస్తరణ తర్వాత బాధ్యతలు స్వీకరించిన  తర్వాత చంద్రబాబు ఒక్కొక్క శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు నిర్వహించిన పర్యాటక రంగం ప్రగతిపై అధికారులతో భేటీ అయిన చంద్రబాబు శాఖ పనితీరుపై దృష్టిపెట్టారు. అందులోభాగంగా కొత్తగా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అఖిలప్రియ కూడా భేటీకి హాజరయ్యారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాఖకు సంబంధించి ఎలా ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.

దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 2020 నాటికి దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుంటుందని, ఆ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని సూచించిన చంద్రబాబు రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యంతో పనిచేయాలని టార్గెట్ పెట్టారు. పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అఖిలప్రియను శాఖపై పట్టుపెంచుకోవాలని సూచించారు చంద్రబాబు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.