చంద్రబాబుకు ఆ నలుగురిని తొలగించే దమ్ముందా???

Chandrababu Cabinet, Cabinet expansion, Tdp Leaders Unhappy,Talasani Challenges ChandraBabu

Chandrababu Cabinet, Cabinet expansion, Tdp Leaders Unhappy,Talasani Challenges ChandraBabu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ  ప్రకంపనలు అటు ఎపితో పాటు తెలంగాణాలోనూ గట్టిగా కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ నుండి కెసఈఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్‌లోకి వెళ్ళి మంత్రి పదవులు పొందిన నాయకులు ఇప్పుడు చంద్రబాబును ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ నుండి గెలిచి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వరరావులకు కెసిఆర్ మంత్రిపదవులు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయంపై పెద్ద దుమారంలేపిన చంద్రబాబు , బహిరంగంగా చాలాసార్లు విమర్శించారు. జంప్ జిలానీలకు  మంత్రి పదవులు ఇవ్వడం నైతికతకు విరుద్ధమని టిఆర్ఎస్ సర్కార్‌పై మండిపడ్డారు.

ఇప్పుడు సీన్ కాస్తా రివర్స్ అయ్యింది. అటు ఎపిలో వైసీపీనుండి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల్లో నలుగురికి చంద్రబాబు మంత్రిపదవులు ఇచ్చారు. దీంతో తెలుగు తమ్ముళ్ళతోపాటు తెలంగాణాలో మంత్రిపదవులు అనుభవిస్తున్న జంపింగ్ మంత్రులకు ఎక్కడో మండింది. అందుకే మంత్రివర్గ విస్తరణ అయిపోయిన తర్వాత ప్రతిపక్షపార్టీ వైసీపీతోపాటు తెలంగాణా మంత్రి తలసాని సైతం చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

మంత్రి పదవులు ఇచ్చిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే ఇక్కడ తాను కూడా రాజీనామా చేస్తానని తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబుకి సవాల్ విసిరారు. ఇప్పటినుండైనా నీతి, నిజాయితీ, నిప్పు అనే పదాలు వాడటం చంద్రబాబు మానేయ్యాలని ఆ పదాలు చంద్రబాబుకు సరిపోవని తలసాని మండిపడ్డారు. టీడీపీలో క్రమశిక్షణ ఎన్టీఆర్‌‌తోనే పోయిందన్న తలసాని ప్రస్తుతం చంద్రబాబును చూసి నేతలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.