చంద్రబాబు మనసులో ఎంత ప్రేమో???

Chandrababu is more intrested in reading his viral Sakshi Daily

Chandrababu is more intrested in reading his viral Sakshi Daily

టైం దొరికినప్పుడల్లా వేదిక ఏదైనా సరే చంద్రబాబు విరుచుకుపడే పత్రిక ఏదైనా ఉందంటే అది సాక్షి అనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. సాక్షి పత్రికపై ప్రభుత్వంపై రాసే రాతలు చంద్రబాబుకి, ఆయన పసుపు తమ్ముళ్ళకు ఏమాత్రం నచ్చకపోవడంతో సహనం కోల్పోయి పలు వేదికల్లో ఆయన సాక్షి పేపర్‌ను చూడొద్దని, చదవొద్దని చెప్పిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంతేగాకుండా పార్టీ నాయకులెవరూ సాక్షి పత్రికను చదవొద్దని పిలుపునిచ్చారు కూడా. అయితే చంద్రబాబు పైకి అందరి ముందూ సాక్షిపై తన అక్కసు వెళ్ళగక్కినప్పటికీ ప్రభుత్వ పనితీరుపై ప్రజల ఫీడ్ బ్యాక్ కోసం సాక్షి పత్రికపై ఆధారపడుతారని ఆయన సన్నిహితులు చాలా సార్లు చెప్పారు.

జాతీయ మహిళా పార్లమెంట్ సందర్భంగా సాక్షితోపాటు అన్ని మీడియా సంస్థలు స్పీకర్ కోడెల కామెంట్స్‌ని కవర్ చేశాయి. అయితే మొన్న జిరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేవలం సాక్షి పత్రికను టార్గెట్ చేసుకొని మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫుల్ సపోర్ట్ చేశారు. అంతేగాక సాక్షిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ సాక్షిగా పట్టుబట్టారు. అయితే ఇంతచేసే చంద్రబాబు అసలు సాక్షి చదవరనుకుంటే పొరపాటే. ఎందుకంటే విశాఖలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు కాన్వాయ్ లో వెళుతున్న సందర్భంలో సాక్షి పత్రికను తీసుకుని మొదటి పేజీ నుంచి చివరి వరకు ఆసాంతం చూస్తూ తనకు అవసరమైన కథనాలు చదివారు.

అందుకే ప్రేమించేవాళ్ళకు సంబంధించినదానిపై లేని ఇంట్రెస్ట్ ద్వేషించేవాళ్ళకు సంబంధించిన దానిపై ఉంటుందనేది ప్రూవ్ అయిపోయింది. బయటికి సాక్షి పత్రికను చదవొద్దని పసుపు తమ్ముళ్ళకు పిలుపునిచ్చే చంద్రబాబు మాత్రం సమయం దొరికినప్పుడల్లా సాక్షిపై తనకున్న ప్రేమను ఇలా చూపిస్తుంటారని అనుకుంటున్నారు అందరూ.

Have something to add? Share it in the comments

Your email address will not be published.