యాధ‌ృచ్చికమా – దైవ సంకల్పమా?

వెలగపూడిలో కొత్త అసెంబ్లీ భవనం చంద్రబాబు రాజకీయ జీవితంలో కీలక మార్పులకు వేదిక అవనుందా? ఎంతో ఆశగా కట్టుకున్న అసెంబ్లీ చంద్రబాబుకి కలిసి వచ్చేలాలేదా? చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయన ఇప్పటివరకు చూడని కొత్త కోణాలు ఈ అసెంబ్లీ వేదికై చూపిస్తుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు, శకునాలు చూస్తుంటే అది నిజమనే అనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశాన్నే కుదిపేసిన ఓటుకు నోటు వ్యవహారంలో సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం అదికూడా అసెంబ్లీ ప్రారంభించుకున్న మొదటిరోజే కావడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.

కొన్ని పనులు జరగాలంటే ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఏమాత్రం ముందుకు జరగవు. ప్రతీ విషయానికి బలం చేకూరేవరకు గడప వరకు వచ్చి వెనక్కి వెళ్తుంటాయి. అదే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం నమ్మినా నమ్మకపోయినా యాధృచ్చికమైనప్పటికీ ఆ పనులు మాత్రం వాటంతట అవే జరిగిపోతుంటాయి. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విషయంలో జరిగింది. వెలగపూడిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవన సముదాయంలో సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలరోజునే సుప్రీంకోర్టు బాబుగారికి నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ‘వెలగపూడిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం, ఎమ్మెల్సీగా చంద్రబాబు తనయుడు నారాలోకేష్ నామినేషన్ వేసిన వెంటనే చంద్రబాబుకు సుప్రీం నోటీసులు జారీచేయడం యాధృచ్చికమో లేక దైవసంకల్పమో’ అని ప్రచారం జరుగుతోంది.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.