నెల్లూరుకు సీఎం చంద్రబాబు

Chandrababu reiterating the sources in AP for Foreign Investments

Chandrababu reiterating the sources in AP for Foreign Investments

అమెరికా పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు నెల్లూరు పర్యటనకు వెళ్ళనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నిషిత్ చనిపోయినప్పుడు చంద్రబాబు అమెరికాలో ఉండడంతో ఈరోజు మున్సిపల్ శాఖామంత్రి నారాయణ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన ముగించుకొని నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొని అక్కడి నుండి రాత్రి 9గంటల30 నిమిషాలకు విజయవాడకు చేరుకున్నారు.

ఈరోజు నెల్లూరులో మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత సాయంత్రం 3 గంటలకు వెలగపూడి సచివాలయానికి చేరుకుని తన అమెరికా పర్యటన విశేషాలను వివరిస్తారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.