‘తప్పు’ ఒప్పుకున్న చంద్రబాబు

Chandrababu regrets

Chandrababu regrets

అపరచాణక్యుడు,తిరుగుబాటు బావుటా ఎగరేసిన వారిని దారికి తెచ్చుకొనే సమర్థుడు, తను అనుకున్నది చేసుకుంటూ ముందుకెళ్ళే రాజకీయ దురంధరుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబునాయుడు మొత్తానికి తను చేసిన తప్పును ఒప్పుకున్నారు.

ఏ విషయంలోనైనా అన్నిరకాలుగా ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాచికలు వేసి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే చంద్రన్న మంత్రివర్గ విసర్తణ పూర్తయిన ఐదురోజులకు దానిపై స్పందించారు.

మంత్రివర్గ విస్తరణలోభాగంగా కొందరు సమర్థులైన నాయకులకు చోటు కల్పించకపోవడం బాధ కలిగించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రివర్గం కూర్పులో ఉన్న నిబంధన ప్రకారం 26 మందికి మించి చోటు కల్పించడం సాధ్యం కాదనే విషయాన్ని పార్టీ నాయకులు గుర్తించాలని కోరారు.

అంతేగాక పార్టీలో అంతర్గతంగా పరిష్కారం దొరికే సమస్యలపై నేతలు రోడ్డెక్కొద్దని సూచించారు చంద్రబాబు. అంతేగాక సోషల్‌ మీడియాలో పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని అరికట్టాల్సిన అవసరం  ఎంతో ఉందన్న బాబు, రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి స్థానంలో గెలిచేలా క‌ృషిచేయాలని అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో  దిశానిర్దేశం చేశారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.