దేశంలో పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమ రాష్ట్రం: చంద్రబాబు

Chandrababu reiterating the sources in AP for Foreign Investments

Chandrababu reiterating the sources in AP for Foreign Investments

అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబుతో టెలీకమ్యూనికేషన్స్‌లో పేరొందిన క్వాల్‌కం  టెక్నాలజీస్  సంస్థ ఉపాధ్యక్షుడు గోపి సిరినేని భేటీ అయ్యారు. ఏపీలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై క్వాల్ కమ్ టెక్నాలజీస్ ఆసక్తి చూపించిన క్వాల్‌కం సంస్థకు ప్రాజెక్టు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించాలని చంద్రబాబు సూచించారు. అయితే ప్రాజెక్ట్ విస్తరణకు ఏఏ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించగలదో పరిశీలించి చెప్పాలని గోపి సిరినేనికి సూచించారు.

అంతకుముందు లాస్ ఏంజెల్స్‌లో టెస్లా ప్రెసిడెంట్, సీఎఫ్‌వో ఎలొన్ మస్క్‌తో, యాపిల్ సీవోవో జెఫ్ విలియమ్స్‌తోనూ బాబు భేటీ అయ్యారు. వీళ్ళిద్దరితో సమావేశం సందర్భంగా భారత్ ఇప్పుడు సుస్థిర వృద్ధి ఫలితాలు సాధిస్తోందని బలమైన దేశంగా భారత్ ఎదిగిందని వివరించారు చంద్రబాబు. ఇతర దేశాలతో పోలిస్తే అత్యధిక యువత ఉన్న దేశం భారతేనన్న సీఎం,  భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని, దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అత్యుత్తమ రాష్ట్రంమని సూచించారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధి, అభివృద్ధి అంశాల్లో భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నామని స్పష్టంచేశారు సీఎం చంద్రబాబు నాయుడు

వీటితోపాటు అమెరికాలో స్థిరపడిన తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం విందు సమావేశం నిర్వహించి తెలుగు పారిశ్రామికవేత్తలతో మూడు ఒప్పందాలు చేసుకున్నారు.  ఇవీఎక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం, 10 వేల ఉద్యోగాల కల్పన – ఐ-బ్రిడ్జితో ఇంక్యుబేటర్, కో-వర్కింగ్ స్పేస్ అంశాల్లో సహకారం, ఇన్నోవా సొల్యూషన్స్‌తో ఒప్పందం, 20వేల ఉద్యోగాల కల్పన వంటి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు టీం ప్రతి ఒక్కరూ మాతృభూమితో సత్సంబంధాలు కొనసాగించాలి పిలుపునిచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.