చంద్రబాబు మంత్రివర్గం నుండి ఏడుగురు ఔట్?

Chandrababu to Induct Nara Lokesh Into Cabinet and seven ministers out on April 2nd

Chandrababu to Induct Nara Lokesh Into Cabinet and seven ministers out on April 2nd

యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్సైంది. ఎన్నోరోజులుగా కళ్ళు కాయలుకాసేలా ఎదురు చూస్తున్న పసుపు తమ్ముళ్ళ ఆశలు నెరవేరే రోజు దగ్గరపడింది. 2019 ఎన్నికలను ద‌ృష్టిలో ఉంచుకొని యువరాజుని మంత్రవర్గంలోకి తీసుకోవడం ఖరారు అవ్వడంతో మంత్రివర్గంలో జంబ్లింగ్ పద్ధతిని అవలంబించాలని అనుకుంటున్నారు ఎపి సీఎం చంద్రబాబునాయుడు. దీంతో ఆశావాహుల్లో సంతోషం నెలకొంటే చాలామంది ప్రస్తుత మంత్రుల్లో ఒకరకమైన భయం ఆవహించింది. చంద్రబాబు వేసే పాచికల్లో ఎవరి వికెట్ ఎగిరిపోతుందోనన్న భయం ఎక్కువగా మంత్రుల్లో కనిపిస్తోంది. అంతేగాక కొంతమంది మంత్రులపై ఇప్పటికే రిపోర్టులు తీసుకున్న చంద్రబాబు వారి దగ్గర ఉన్న కీలక శాఖలను మార్చడానికి డిసైడ్ అయ్యారని సమాచారం.

ఏప్రిల్ 2న క్యాబినెట్ విస్త‌ర‌ణ‌ చేయాలని ఒకవేళ ఆరోజు కుదరకపోతే  ఏప్రిల్ 6న మంత్రివర్గ విస్తరణ చేయాలని యోచిస్తున్నారట. క్యాబినెట్ విస్త‌ర‌ణ కోసం సీఎం చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు ఇప్ప‌టికే పూర్తి చేశార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు, సామాజిక వ‌ర్గాల ఆధారంగా భ‌ర్తీ చేశార‌ని స‌మాచారం..

నేత‌ల ప‌నితీరు, జిల్లావారీగా స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చంద్ర‌బాబు క్యాబినెట్ ను విస్త‌రించ‌నున్నారు. ప్ర‌తి జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉండేలా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. అయితే ఇవన్నీ 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని జరిగే  మార్పులు, చేర్పులని పసుపు తమ్ముళ్ళు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎపి క్యాబినెట్‌లో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఉన్న ఖాళీలకు తోడుగా నలుగురినుండి ఏడుగురు మంత్రులను క్యాబినెట్‌నుండి తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు 8 నుండి 10మంది కొత్తవారికి మంత్రిపదవులు వరిస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్‌లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నారా లోకేశ్, అఖిల ప్రియలతో పాటు కొంతమంది పార్టీ సీనియర్లకు, మరొకొంతమంది వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన నాయకులకు అవకాశం కల్పించేటట్లు అనిపిస్తోంది.

క్యాబినెట్ నుండి బయటికి వెళ్ళే మంత్రులు..?

 1. శిద్దా రాఘ‌వ‌రావు
 2. రావెల కిషోర్ బాబు
 3. కొల్లు ర‌వీంద్ర‌
 4. పీత‌ల సుజాత‌
 5. ప‌ల్లె ర‌ఘ‌నాథ‌రెడ్డి
 6. మృణాళిని
 7. ప్ర‌త్తిపాటి పుల్లారావు

క్యాబినెట్‌లోకి వచ్చే కొత్త మంత్రులు..?

 1. నారా లోకేష్
 2. అఖిల‌ప్రియ‌
 3. య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు
 4. చాంద్ చాషా
 5. సుజ‌య క్రిష్ణ‌ రంగారావు
 6. శ్రీరామ్ రాజ‌గోపాల్
 7. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి
 8. న‌క్కా ఆనంద్ బాబు
 9. డొక్కా మాణిక్యవ‌ర‌ప్ర‌సాద్
 10. మాగుంట శ్రీవివాసుల‌రెడ్డి

 

క్యాబినెట్‌లో శాఖ‌ల మార్పు..?

 1. కె.ఈ కృష్ణ‌మూర్తి
 2. చిన‌రాజ‌ప్ప‌
 3. గంటా శ్రీనివాస‌రావు

Have something to add? Share it in the comments

Your email address will not be published.