నేనిష్టంలేకపోతే నేను మీకెందుకు పనిచెయ్యాలి???

Chandrababu Naidu Sensational comments on voters at Nandyal Iftar Party

ముఖ్యమంత్రి వచ్చాడు కదా వెళ్ళి మా సమస్యలు తీర్చండయ్యా అని అడిగితే ఎలాగూ ఉపఎన్నికలు ఉన్నాయి కాబట్టి హామీలిచ్చేస్తాడులే అనుకున్న నంద్యాల ఓటర్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శిల్పా మోహన్‌రెడ్డి టిడిపిని వీడి జగన్మోహన్‌రెడ్డిపంచన చేరడంతో ఖాళీ అయిపోయిన టీడీపీ శ్రేణులను సమాయత్త పరిచి నంద్యాల ఉపఎన్నికలకు తయారు చేయడానికి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్నారు.

Chandrababu Naidu Sensational comments on voters at Nandyal Iftar Party

అందులోభాగంగానే కర్నూలు జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఉపఎన్నికలకు పార్టీని ఎలాంటి ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్ళాలో దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో సీఎంను కలిసేందుకు స్థానిక ప్రజలు అక్కడకు చేరుకుని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. దానికి సీఎం సమస్యల చెప్పడం కాదు, వినండంటూ అడ్డుపడ్డారు. అంతేగాక అక్కడి వచ్చిన వారిపై తనదైన స్టైల్లో వీరతాండవం చేసి ఎందుకొచ్చాం రా బాబూ అనేలా చేసి పంపించారు.

See Also: శిరీష మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు

రాయలసీమ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి నాయకులను తీసుకొచ్చామని, తమకంటే వాళ్ళ తర్వాత తరం నాయకులు మరింత పాజిటివ్‌గా ఉన్నారని తెలిపారు చంద్రబాబు. అంతేగాక రాజకీయంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చాం. ఎన్నికలు గెలవాలి. గెలవడానికి నాయకుడు కావాలి కాబట్టి మేం కొన్ని రాజీ పడ్డాం. మేం రాజీపడడం వల్ల టీడీపీలో కొంతమందికి నష్టం కూడా జరిగింది. కొంతమంది నాయకులకు నష్టం జరిగిందని కూర్చున్న చెట్టును నరుక్కుంటామా?.అని ప్రశ్నించారు చంద్రబాబు.

అంతేగాక తనవల్ల లాభం పొందినవాళ్లంతా మళ్లీ తనకు ఓటేయాలి కదా అంటూ అక్కడికి వచ్చిన స్థానికి ప్రజలను ప్రశ్నించారు. మధ్యలో పదేళ్ల పాటు తానే అధికారంలో ఉంటే రాష్ట్రం ఎక్కడికో పోయేదని. తాను వెయ్యి రూపాయలు పెన్షన్‌​ ఇస్తున్నానని, రుణమాఫీ చేశానని, ఎవరు డబ్బిచ్చినా తనకే ఓటేయాలని ప్రజలకు చెప్పుకొచ్చారు చంద్రబాబు. అంతేగాక తాను తలచుకుంటే ఓటుకు 5వేల రూపాయిలు ఇవ్వగలనని, కానీ ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు..

See Also: చంద్రబాబుకు లేఖరాసిన ఉండవల్లి

తనకు వ్యతిరేకంగా ఏవైనా గ్రామాలుంటే వాటికో నమస్కారం పెడతానని, తనంటే ఇష్టం లేకపోతే… తాను మీకెందుకు పనులు చేయాలి? అని ఎదురు ప్రశ్నలు వేసారు చంద్రబాబు. “నేనిచ్చిన పెన్షన్‌ తీసుకుంటున్నారు. నేనిచ్చిన రేషన్‌ తీసుకుంటున్నారు. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నాకు ఓటేయకుంటే ఎట్లా?. నా పరిపాలన బాగా లేదంటే నేనేమీ తీసుకోను. నాకేమీ వద్దు అన్నట్లు ఉండాలని హితవు పలికారు’ ముఖ్యమంత్రి.

మొత్తానికి తనకు నచ్చినట్లు ఉండకపోతే, తనంటే ఇష్టపడకపోతే దూరం పెట్టేస్తానని, వాళ్ళ పనులు ఏవీ చేయనని అందరినీ ఉద్దేశించి చెప్పేశారు చంద్రబాబు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.