లండన్ లో `చేనేత-చేయూత` సదస్సు

chenetha-cheyutha conference in london

chenetha-cheyutha conference in london

లండన్: లండన్ లో ఎన్ఆర్ఐ జనసేన ఆధ్వర్యం లో 9 వ తేదీ ఆదివారం నాడు చేనేత – చేయూత సదస్సు  దిగ్విజయంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం లో సుమారు 600 మంది దాకా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సారధ్యం లో జనసేన పార్టీ తరఫున ప్రజా సమస్యల పై పోరాడతామని, కావాల్సిన సహాయకారాలు అందిస్తామని ఈ సందర్బంగా కార్యకర్తలు ప్రకటించారు. ఈ సదస్సు లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కళాకారుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి కావాల్సిన విధి విధానాల పై కూలంకషంగా చర్చించారు. చేనేత కళాకారుల సమస్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని, ఈ దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, నేత కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వమే నేరుగా వస్త్రాలను కొనుగోలు చేయాలని అధికులు భావించారు. ఈ సదస్సు లో చర్చించిన విషయాలను జనసేన  కార్యాలయానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా పంపడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఈస్ట్ హాం కౌన్సిలర్ పాల్ విచ్చేసారు. ఈ కార్యక్రమం లో మరొక్క విశేషం ఏంటంటే ప్రముఖ సినీతార ప్రణీత గారు చేనేత కు పూర్తి మద్దతు తెలుపుతూ తమ సందేశాన్ని పంపారు. ఈ సదస్సు లో జనసేన కార్యకర్తలు ఇంగ్లాండ్ లో ని వెస్ట్ లండన్, సౌతాంఫ్టన్, మాంచెస్టర్ తదితర ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, జర్మనీ, తైవాన్ తదితర దేశాల నుంచి కూడా  కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పాల్గొనడం విశేషం. జనసేన పార్టీ కార్యాలయం నుంచి సందీప్ పంచకర్ల కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొని వారి యొక్క మద్దతును ప్రకటించి నిర్వాహకులను అభినందించారు. ఈ సదస్సులో ఎన్ఆర్ఐ జనసేన కార్యవర్గం నాగ  రమ్యకాంత్, అయ్యప్ప గార్లపాటి, నరేంద్ర మున్నలూరి, శ్రీరామ్ అంగజాల, రుద్ర వర్మ బట్ట, శ్రీకాంత్ మద్దూరి,రాంబాబు, సురేష్ మొగంటి, రాఘవ,జగదీష్, రాకేష్, ఉదయ్, రాజవశిష్టా, సిద్ధం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/eqg5B3jRkUA

Have something to add? Share it in the comments

Your email address will not be published.