వచ్చే నెలలో రానున్న ‘లండన్‌బాబులు’

chinnikrishna-colors-swathi-maruthi-combo-london-baabulu-coming-this-june
chinnikrishna-colors-swathi-maruthi-combo-london-baabulu-coming-this-june
ఎప్పటిక‌ప్పుడు కొత్త కాన్సెప్ట్‌ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో క్వాలిటిగా చిత్రాల‌ను నిర్మిస్తున్న మారుతి టాకీస్‌, ఎవిఎస్ స్టూడియోస్‌ సమర్పణలో ప్రముఖ దర్శక‌, నిర్మాత‌ మారుతి నిర్మాతగా, చిన్ని కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం లండన్ బాబులు. త‌మిళం లో విజ‌య్‌సేతుప‌తి, రితికా సింగ్ క‌ల‌సి నటించిన “ఆండ‌వ‌న్ క‌ట్టాలై”  చిత్రాన్ని తెలుగు లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే ట్రైల‌ర్ ను రిలీజ్ చేయనున్నారు. జూన్ ఎండింగ్ లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత మారుతి మాట్లాడుతూ ‘త‌మిళం లో విజ‌య్‌సేతుప‌తి, రితిక న‌టించిన “ఆండ‌వ‌న్ క‌ట్టాలై” చిత్రానికి రీమేక్ గా మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం లండ‌న్ బాబులు. ఈ మూవీ త‌మిళంలో చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ న‌చ్చి ఈ చిత్రాన్ని చేస్తున్నాము. చిన్నికృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. చిన్నికృష్ణ కామెడి టైమింగ్ కూడా ఈ చిత్రానికి చాలా హెల్ప్ అయ్యింది.  అలాగే  స్వాతి హీరోయిన్ గా చేస్తుంది. స్వాతి మీడియోలో యాంక‌ర్ గా సొసైటి ప‌ట్ల బాధ్యత క‌లిగిన పాత్ర‌లో చాలా బాగా చేసింది. ర‌క్షిత్ హీరోగా ప‌రిచ‌యమ‌వుతున్నాడు. కొత్త వాడిలా కాకుండా సీనియ‌ర్ న‌టుడిగా పాత్ర‌లో ఒదిగిపోయాడు. సీనియ‌ర్ న‌టులు ఆలీ, ముర‌ళి శ‌ర్మ‌, జీవా , అజ‌య్ ఘొష్‌, రాజార‌వింద్ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో నటించారు.
ఒక్కొక్క‌రి పాత్ర చిత్ర క‌థ‌ని మ‌లుపులు తిప్పుతూ చివ‌ర‌కి హీరో లండ‌న్ ఎలా వెళ్ళాడ‌నేది ముఖ్య‌క‌థాంశం. ప్ర‌తిపాత్ర‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ద‌ర్శ‌కుడు చాలా కొత్త‌గా చిత్రాన్ని తెర‌కెక్కించాడు.  ప్రెజెంట్ హెపెనింగ్ క‌మిడియ‌న్స్ ధ‌న‌రాజ్‌, స‌త్య‌, ఈరోజు్ల్లో సాయి కామెడి ప‌రంగా న‌వ్వించారు. ఈ చిత్రానికి శ్యామ్‌.కె.నాయిడు కెమెరా, ఉద్ద‌వ్ ఎడిటింగ్ మ‌రో ఎసెట్ గా నిలుస్తాయి. అతిత్వ‌ర‌లో ట్రైల‌ర్ ని , జూన్ లో ఆడియోని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.