దాసరికి అల్లు రామలింగయ్య అవార్డు ప్రదానం చేసిన మెగాస్టార్

Chiranjeevi presented Allu Ramalingaiah Award to Dasari NarayanaRao on his birthday

Chiranjeevi presented Allu Ramalingaiah Award to Dasari NarayanaRao on his birthday

ప్రముఖ దర్శకుడు, నటుడు దాసరి నారాయణరావుకు మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. దాసరి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవితోపాటు నిర్మాత అల్లు అరవింద్, నటుడు మోహన్‌బాబు, వరప్రసాద్‌రెడ్డి, తమ్మారెడ్డి, భరద్వాజతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దాసరి నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత అల్లురామలింగయ్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.

‘డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు దాసరి. ఒక ఆర్టిస్ట్ పేరు మీద జాతీయ అవార్డును ఏర్పాటు చేయడం, ఆ అవార్డును తాను అందుకోవడంతో అల్లు రామలింగయ్యకు, తనకు అనుబంధం మరింతగా బలపడిందని చెప్పారు దాసరి నారాయణరావు.  అల్లు రామలింగయ్యకు, తనకు ఉన్న అనుబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలుసన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.