చిరు, బ్రహ్మిలపై మండిపడ్డ జంధ్యాల భార్య

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు దివంగత జంధ్యాల సతీమణి అగ్ర నటుడు చిరంజీవి, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంపై మండిపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. తన భర్తను అవమానించినందుకు ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని తెలుస్తోంది.

“కౌన్ బనేగా కరోడ్ పతి“ని అనుకరించి నిర్మించిన `మీలో ఎవరు కోటీశ్వరుడు` కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా వచ్చిన బ్రహ్మానందం, యాంకరింగ్ చేస్తున్న చిరంజీవి అనేక హాస్యభరిత చిత్రాలను నిర్మించిన ప్రముఖ దర్శకుడిని జ్ఞాపకం చేసుకున్నారు.  జంధ్యాల ముద్దుగా `బ్రహ్మీ` అంటూ పిలుచుకున్న బ్రహ్మానందం ఆయన సృష్టే. బ్రహ్మానందంకు ప్రస్తుతం సినీరంగంలో ఇంతగా పేరు, డబ్బు రావడానికి, కెరీర్ ఈ స్థాయిలో ఊపందుకోవడానికి కారణం జంధ్యాలే.  ఆ రకంగా బ్రహ్మి ఆయనకు ఎంతో రుణపడి ఉండాలి. సినీ పరిశ్రమకు బ్రహ్మానందాన్ని పరిచయం చేసి, ప్రోత్సహించింది జంధ్యాలే.

కార్యక్రమంలో హీరోకు, హాస్యనటుడికి జరిగిన సంభాషణలో తన గురువు అతిగా మద్యం సేవించడం వల్లనే మరణించారని బ్రహ్మానందం చెప్పారు. జంధ్యాల మద్యం అలవాట్ల గురించి, మద్యం సేవించిన తర్వాత ఆయన ప్రవర్తన గురించి ఒక ఐదు నిమిషాలపాటు చర్చ జరిగింది. వాస్తవానికి దానిపై వారు ఇంతగా చర్చించనవసరం లేదు. వారు దానిని పూర్తిగా నివారించి ఉండవచ్చు. సాధారణంగా మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడటం మన సంస్కృతి కాదు. దర్శకుడి సుగుణాల గురించి ఇద్దరు నటులూ మాట్లాడుతూనే, రాజబాబులాగానే జంధ్యాల కూడా అతిగా మద్యం సేవించడం వల్ల మరణించారని ప్రేక్షకులకు అన్యాపదేశంగా చెప్తూ వచ్చారు. ఈ ఎపిసోడ్ ను  వీక్షించిన జంధ్యాల సతీమణి రాణి, ఇద్దరు కుమార్తెలు అవమానానికి, తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

వెంటనే బ్రహానందానికి ఫోన్ చేసిన రాణి తన భర్త గురించి ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడిన ఆయనను ఛెడామడా తిట్టారని తెలిసింది. గురుపత్ని అయిన రాణి అంటే బ్రహ్మికి గౌరవం. తన తప్పును గుర్తించిన ప్రముఖ హాస్య నటుడు తప్పు చేశానని అంగీకరించడమే గాక, అలా నోరు జారినందుకు క్షమించమని కోరారు. గతంలో అతడి అరాచక పద్ధతులను, అందుకు జంధ్యాల ఆయనను అనేకమార్లు మందలించడాన్ని గుర్తు చేస్తూ, మర్యాదగా మసలుకోమంటూ రాణి ఆయనను హెచ్చరించారు.

తర్వాత ఆమె చిరంజీవికి ఫోన్ చేశారుట. ఆయన  ఆ సమయంలో ముంబై వద్ద షూటింగులో ఉన్నారట. తన భర్త మద్యం అలవాటు గురించి పదే పదే మాట్లాడేందుకు బ్రహ్మానందాన్ని అనుమతించినందుకు ఆయనకు కూడా అక్షింతలు వేశారు. తన భర్త మెడికల్ రిపోర్టులు తన వద్దే ఉన్నాయని ఆమె చెప్పారు. ఆయన తీవ్రమైన మధుమేహ వ్యాధితో మరణించారే తప్ప ఆయనకు ఎప్పుడూ లేని లివర్ సమస్యతో కాదని అవి స్పష్టం చేస్తున్నాయి. చిరంజీవి కూడా విచక్షణతో వ్యవహరించనందుకు క్షమాపణ చెప్పారు. ప్రముఖుడైన ఆమె భర్త పట్ల తనకు ఎంతో గౌరవం ఉన్నట్టు ఆయన పదే పదే చెప్పారుట.

ఈ విషయంపై న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను కూడా రాణి పరిగణించినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు నటులూ క్షమాపణ చెప్పినందున పరువు నష్టం దావా గురించి ఆలోచించవద్దని ఆమె స్నేహితులు, శ్రేయోభిలాషులు  సూచించారు. సహజంగా ఎంతో సౌమ్యురాలైన రాణి ఈ విషయాన్ని అంతటితో వదిలిపెట్టినట్టు కనిపిస్తోంది. కానీ, చిరంజీవి, బ్రహ్మానందం, టివి ఛానెల్ యాజమాన్యం తమ అనుచిత ప్రవర్తనకు, జంధ్యాల మరణానికి సంబంధించి వాస్తవ సమాచారం లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడినందుకు అదే `మా` టివి ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె పట్టుబడుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • pattabhiram says:

    హాస్యబ్రహ్మ శీ జంధ్యాల గారిని ఒక తాగుబోతుగా చిత్రిస్తూ మాట్లాడిన బ్రహ్మానందం గారు తప్పు చేశారు జంధ్యాల గారు ఏనాడు తాగి సభలకు రాలేదు, దీనికి ఆయన SORRY చెప్పాలి. పరనింద ఆత్మస్తుతి పనికిరాదు. సభకు నమస్కారం అనే మాట ప్రవేశపెట్టిన మహావ్యక్తి పైనా కట్టుకథలు?
    పట్టాభిరాం