‘సినీ మహల్ ‘ మూవీ రివ్యూ

Cine Mahal movie Review by Sakalam

Cine Mahal movie Review by Sakalam

నటులు :సిద్ధాంశ్ , రాహుల్, తేజస్విని

సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌

నిర్మాత : బి.రమేష్

దర్శకత్వం : లక్ష్మణ్ వర్మ

 

హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు టాలీవుడ్‌లో యామ క్రేజ్ ఉంది. అందుకే ఈ మధ్య దాదాపు వచ్చే సినిమాల్లో ఎక్కువగా ఈ జానర్‌లోనే తీస్తున్నారు. ఎందుకంటే ఇది పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ అవ్వడం చాలీ ఈజీ. అదే ఫార్ములాను ఎంచుకున్నాడు డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ. హర్రర్, థ్రిల్లర్ రెండింటినీ కలిపి తెరకెక్కించిన సినిమా సినీ మహల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

 

కథ :
టౌనుకు తక్కువగా పల్లెటూరికి ఎక్కువగా ఉండే ఓ ఊళ్ళో క‌ృష్ణ అనే యువకుడు ఉంటాడు. తాతల కాలంలో తన తాత కట్టించినటూరింగ్ టాకీస్ ను నడుపుకునే అతను తండ్రి చేసిన అప్పును తీర్తీచడానికి సర్ర్చివవిధాల కష్టపడుతుంటాడు. అందులో భాగంగా మంచి సినిమాలు తెచ్చి కలెక్షన్లు సంపాదించాలని ఆలోచనతో ముందుకెళ్తుంటాడు. తన టాకీస్లో ఏదైనా మంచి సినిమా వేయాలని తనకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి ’13’ అనే సినిమాను కొని తెచ్చుకుని షో వేస్తాడు. కానీ టాకీస్లో కూర్చొని ఆ సినిమా చూసిన ప్రేక్షకుల్లో కొంత మంది అనుకోకుండా చనిపోతుంటారు. అలా చనిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి? అసలు ఆ సినిమా వెనకున్న రహస్యమేమిటో తెలుసుకోవాలని హైదరాబాద్ వెళ్తాడు కృష్ణ. అలా వెళ్లిన కృష్ణ తెలుసుకున్న భయంకరమైన నిజాలేంటి? చివరికి కృష్ణ ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు ? ఎలా బయటపడుతాడన్నదే కథ.

 

ఎనాలసిస్:

టూరింగ్ టాకీస్‌ అనే ఓ చిన్న పాయింట్ ద్వారా ఒక సినిమా చేయాలన్న దర్శకుడి ఆలోచన బాగుంది. టూరింగ్ టాకీస్లో నడిచే సినిమా వెనకున్న నైపథ్యమే. ఆ నైపథ్యంలోని ఒక కీలకమైన అంశం బాగా ఆకట్టుకుంది. సినిమా మొదలైనప్పటినుండి థియేటర్లో సినిమా చూసిన వాళ్ళు చనిపోవడం, ఆ సినిమా వెనక్కున్న థ్రిల్ చేసే రకంగా తెరకెక్కించడం బాగుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్లో సినిమా చూసిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనే ప్రశ్నకు దొరికే జవాబు చాలా థ్రిల్లింగా ఉంటుంది. నిజం తెలుసుకున్న హీరో సెకండాఫ్లో తన టాకీస్ నుండి ’13’ సినిమాను తీసేయడానికి చేసే ప్రయత్నాలు కూడా కాస్త ఆసక్తికరంగా సాగాయి. దీనికితోడు హీరో ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సత్య చేసిన కామెడీ కూడా అక్కడక్కడా బాగానే వర్కౌట్ అయ్యింది.  సినిమా మొదలైనప్పుడు బాగానే ఉన్నప్పటికీ కొంచం సేపు అయిన తర్వాత కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ కథలో ముఖ్యమైన సినిమా తీసే ఎపిసోడ్ అస్సలు ఆకట్టుకోలేదు. ఆ సన్నివేశాల్లో నటించిన నటీ నటుల నటన అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో ఆ ఎపిసోడ్ తేలిపోయింది. సమస్యను తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో కొంత కూడా సమస్య పరిష్కారానికి పెట్టకపోవడం అసంతృప్తిని మిగిల్చింది. సరే చేసిన ఆ చిన్న ప్రయత్నమైనా లాజికల్ గా రీజనబుల్ గా ఉందా అంటే అదీ లేదు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వల్ల మళ్ళీ సినిమాలో జీవం వచ్చేసింది.

దర్శకుడు లక్ష్మణ్ వర్మ కథకు కావాల్సిన మూలాన్ని బాగానే తయారు చేసుకుని దాని ద్వారా సినిమా చేద్దాం అనుకోవడం బాగున్నా కూడా దాని చుట్టూ కావాల్సిన బలమైన కథ, కథనాలను పూర్తి స్థాయిలో అల్లుకోలేకపోయాడు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఓకె అనిపించింది. దొరై కె.సి.వెంకట్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది.

ఓవరాల్: రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి తెరకెక్కిన కథ

రేటింగ్: 3/5

 

-శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.