`మ‌యూరి` ద్వారా ఈనెల 31న `సినీమ‌హ‌ల్‌` రిలీజ్‌

CineMahal ready to release on March 31st by Mayuri
CineMahal ready to release on March 31st by Mayuri
కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెర‌కెక్కిన‌ చిత్రం `సినీ మహల్`. `రోజుకు 4 ఆటలు` అనేది ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వం వ‌హించారు. బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని నాయ‌కానాయిక‌లు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన ఈ సినిమా `మ‌యూరి` ద్వారా ఈనెల 31 (మార్చి 31)న రిలీజ‌వుతోంది.
నిర్మాతలు మాట్లాడుతూ “సినీ మ‌హ‌ల్ టైటిల్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. అలాగే అనుకున్న దానికంటే సినిమా అద్భుతంగా వ‌చ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్ సంథింగ్ స్పెష‌ల్‌. కొత్త తరహాలో సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. డైరెక్ట‌ర్ లక్ష్మణ్ వర్మ చక్కగా తెరకెక్కించారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని బాగా నటించారు. ముఖ్యంగా సలోని స్పెషల్ సాంగ్ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. ఇప్ప‌టికే ఈ పాటకి వెబ్‌లో చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీ న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న చందంగా ఆక‌ట్టుకుంటుంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం, దొరై సి.వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ, ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఈనెలాఖ‌రున (మార్చి 31న‌) సినిమా రిలీజ్ చేస్తున్నాం. ప్ర‌ఖ్యాత మ‌యూరి సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డ‌మే స‌గం విజ‌యం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా ఉంది“ అన్నారు.
గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన  ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర, నిర్మాత: బి.రమేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

Have something to add? Share it in the comments

Your email address will not be published.