సినిమా ప్రమోషనా లేక నిజంగానే హీరో, డైరెక్టర్ కిడ్నాప్‌ అయ్యారా??

Cinematic Kidnap: Khayyum Bhai Movie Hero and Director kidnapped and released

సినిమా ప్రారంభోత్సవం రోజు నుండి ఏదో ఒక హడావిడి చేసి పబ్లిసిటీ పెంచుకోవాలని ట్రై చేసే వాళ్ళు చాలా ఎక్కువగానే ఉంటారు. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమో, కొన్ని సీన్లు కావాలనే లీక్ చేయించి తమ సినిమాలో సీన్లు లీక్ అయ్యాయని పోలీసుల చుట్టూ తిరిగి మీడియాలో పబ్లిసిటీ కోసం తాపత్రయ పడడంలాంటివి చేస్తూ ఉంటారు. అయితే గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఖయ్యూం భాయ్ సినిమా మొదటి నుండి పబ్లిసిటీ కోసం ఏదో ఒకరకంగా ట్రై చేస్తూనే ఉంది. అయితే శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా దర్శకుడు భరత్ పారేపల్లి, హీరోగా టైటిల్ రోల్ చేసిన కట్టా రాంబాబు కిడ్నాప్‌ విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Cinematic Kidnap: Khayyum Bhai Movie Hero and Director kidnapped and released

గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘ఖయ్యూం భాయ్’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తర్వాత హీరో, డైరెక్టర్ ఇద్దరు కిడ్నాప్ అయ్యారని వార్తలు రావడంతో సినిమా యూనిట్ ఆందోళనకు గురైంది. అయితే  భరత్, రాంబాబు చెప్పిన వివరాల ప్రకారం ‘ కారులో వెలుతున్న తమను కొందరు దుండుగులు అడ్డుకుని కిడ్నాప్ చేశారని, అనంతపురం తీసుకెళ్లి ఓ హోటల్‌లో ఉంచి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తర్వాత వారే తమను వదిలేసి పారిపోయారని తెలిపారు.హైదరాబాద్ వచ్చాక పూర్తి వివరాలు తెలియచేస్తామని అన్నారు.

See Also: పీఠం కోసం తెర వెనుక మంతనాలు

అయితే ఈ కిడ్నాప్ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉందని, నిజంగానే వీరిని దండుగులు కిడ్నాప్ చేశారా? సినిమా ప్రమోషన్ కోసం డ్రామా ఆడుతున్నారా? కిడ్నాప్ చేస్తే డబ్బు ఇవ్వక ముందు ఎందుకు వదిలేశారు? ఇలా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా పబ్లిసిటీలో భాగంగా హీరో డైరెక్టర్ కలిసి కిడ్నాప్ డ్రామా చేశారనే అందరూ అనుకుంటున్నారు. అంతేగాక జూన్ 30న విడుదలైన ‘ఖయ్యూం భాయ్’ వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించామని చెప్పినప్పటికీ రియాల్టీకి దూరంగా ఉందనే విమర్శలు వచ్చాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.