గుంత కనిపించిందంటే ఇక క్షమించేది లేదు: కేసీఆర్

CM KCR fires on R&B officials on Negligence in maintaining state Roads

CM KCR fires on R&B officials on Negligence in maintaining state Roads

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ప్రజలు పడుతున్న అవస్థలు పాలకులకు అర్థమౌతున్నాయి. అది ఏదో జనాలపై ప్రేమతో అనుకుంటే మీ పొరపాటే. అధికారంలో ఉన్న పాలకులకు ఏదైనా సమస్య వాళ్ళకు ఎదురైనప్పుడు గుర్తురావడం సహజం. అలాంటిదే ఈరోజు ఓ నిర్ణయం జరిగింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య వరంగల్‌ నుండి పాలకుర్తికి రోడ్డు ప్రయాణం చేసినప్పుడు రోడ్డుపై అనేక గుంతలు కనిపించాయట. రోడ్లపై గుంతలుండద్దని ఎప్పటికప్పుడు పూడ్చేయాలని చాలాసార్లు చెప్పినప్పటికీ అధికారులు సీరియస్‌గా తీసుకోవట్లేదని కేసీఆర్ మండిపడ్డారు. నెల రోజుల్లోగా గుంతలు పూడ్చకపోతే గుంత కనిపించిన దగ్గరే అక్కడికక్కడ బాధ్యుడైన అధికారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు కేసీఆర్.

ప్రగతి భవన్‌లో రోడ్లు భవనాల శాఖ పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష స‌మావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఏ రహదారిపై కూడా ఒక్క గుంత కూడా కనిపించవద్దని, మే నెలాఖరులోగా అన్ని గుంతలు పూడ్చేయాలని ఆదేశించారు. జూన్ 1 తర్వాత తాను రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు మార్గంలో పర్యటిస్తానని, ఎక్కడ గుంత కనిపించినా సరే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కేసీఆర్. ఆర్ అండ్ బి శాఖకు కొత్త రహదారుల నిర్మాణానికి, రహదారుల మరమ్మత్తులకు అవసరమైన నిధులు బడ్జెట్లోనే కేటాయించామని, అయినా ఇంకా గుంతల రోడ్లు కనిపించడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం క్షమించేది లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మొత్తానికి గత కొన్ని నెలలుగా రోడ్లపై గుంతల కారణంగా అవస్థలు పడుతున్న తెలంగాణా ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినందుకు అందరూ సంతోషిస్తున్నారు. సీఎం పుణ్యమాని గుంతలులేని రోడ్లను మనం భవిష్యత్తులో చూస్తామేమో…

Have something to add? Share it in the comments

Your email address will not be published.