నేను ఎంత మొండో మీ అందరికీ తెలుసు: కేసీఆర్

CM kcr inaugurates Haritha Haram in Telangana and assures of greenery

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం ఎలాగైతే మొండి అందరి సహాయ సకరాలు తీసుకుంటూ ముందుకెళ్ళి సాధించుకున్నామో అదే విధంగా రాష్ట్రం మొత్తం పచ్చగా తయారుకవాలంటే ప్రతీ ఒక్కరు ఇంట్లో పిల్లల్ని పెంచినట్లు.. ఇప్పుడు నాటిన మొక్కల్ని పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరీంనగర్‌లో హరితహారం కార్యక్రమం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

CM kcr inaugurates Haritha Haram in Telangana and assures of greenery

తను ఎంత మొండి వ్యక్తో అందరికీ తెలుసునని, ఏదైనా మాట చెప్తే తప్పే ప్రసక్తేలేదని చెప్పుకొచ్చారు కేసీఆర్. మ‌నం పుట్టిన‌ప్ప‌టి నుంచి చచ్చిపోయేవ‌ర‌కు క‌ట్టె మ‌న జీవితంలో భాగం అవుతుంది. పుట్ట‌గానే ఊగ‌డానికి ఊయ‌ల కావాలి. అది క‌ట్టెతోనే తయార‌వుతుంది. స‌చ్చిన‌పుడు మోయ‌డానికి పాడె కావాలి. అదీ క‌ట్టెతోనే త‌యారు చేస్త‌ర‌ని, ఈ క‌ట్టె చెట్టునుంచే వ‌స్తుంద‌న్న విష‌యం మ‌రిచిపోరాద‌ని సీఎం చెప్పారు. ప్ర‌కృతిని కాపాడితే అది మ‌న‌ల్ని కాపాడుతుంది. మ‌నం చెట్ల‌ని పెంచితే ప్ర‌కృతి హ‌ర్షించి వ‌ర్షిస్తుంద‌ని చెట్ల పంప‌కం ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు విడ‌మ‌రిచి చెప్పారు. ఇంట్లో ప్ర‌తి ఒక్క‌రు మొక్క నాటడ‌మే కాదు దాన్ని పెంచే బాధ్య‌త కూడా తీసుకోవాల‌ని కోరారు.  మనిషి జీవితమంతా చెట్టుతో పెనవేసుకొని ఉందన్నారు .

పిల్లలకు ఎంత ఆస్తి సంపాదించి పెడితే ఏం లాభం.. వారికి ఆ ఆస్తిని అనుభవించే వాతావరణం కల్పించాలి. అప్పుడే ఆ పిల్లలు ఆస్తిని అనుభవిస్తారు. అదే విధంగా మొక్కలను కూడా మంచిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అంతేగాక రేపట్నుంచి 25వ తేదీ వరకు వర్షాలు విస్తారంగా పడుతాయని వాతావరణ శాఖ చెప్తుందని గుర్తు చేశారు. చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకృతి హర్షిస్తది.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు కేసీఆర్. భూమిలో తేమశాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పచ్చదనంతో కళకళలాడాలి. ఇవన్నీ కావాలంటే మొక్కలను పెంచి పెద్ద చేయాలని సూచించారు సీఎం. మొక్కలు నాటడం మన సొంత పనిగా భావించినప్పుడు హరిత తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.

See Also: టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

తను ఒక నేను మొండి వ్య‌క్తినని అందరికీ తెలుసునని.. మాట చెప్ప‌న‌నంటే త‌ప్ప‌నని అన్న కేసీఆర్, క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణాన్ని లండ‌న్ న‌గ‌రంలా త‌యారు చేస్తానని,ఇది ఏ ఒక్క‌రో చేస్తే కాద‌ని, ప్ర‌తి ఒక్క‌రు క‌లిసిక‌ట్టుగా చేస్తేనే అవుతుందని కేసీఆర్ కరీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌నుద్దేశించి చెప్పారు. కరీంనగర్ రోడ్లన్ని చాలా బాగా తయారు అవుతున్నాయని, రాబోయే రోజుల్లో కరీంనగర్ లండన్‌లా తయారు చేయడానికి కరీంనగర్ ప్రజల సహకారం కావాలన్నారు. .

హరిత తెలంగాణను తయారు చేయడంలో భాగంగా 523 అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామపంచాయతీకి ఉత్తమ గ్రామపంచాయతీకి 5 లక్షల రూపాయల చొప్పున అవార్డు ఇస్తామని, ఉత్తమ మండలానికి 8 లక్షల రూపాయల అవార్డు, పట్టణంలో ఉత్తమ వార్డుకు 5 లక్షల అవార్డు, ఉత్తమ ప్రాథమిక పాఠశాలకు 2 లక్షల అవార్డు వంటి అనేక అవార్డులు మొత్తంగా 523 అవార్డులు ఇస్తామన్నారు కేసీఆర్.

See Also: పోలీసుల్లో గులాబీ భక్తి: బోనాల్లో కేంద్రమంత్రికి అవమానం

Have something to add? Share it in the comments

Your email address will not be published.