ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగద్దు: కేసీఆర్

CM KCR serious review meeting on Drugs case with Akun Sabharwal

రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన డ్రగ్స్ కేసులో రాజకీయ ఒత్తిళ్ళు అనేకం ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతుండడంతో సీఎం కేసీఆర్ ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని, దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టొద్దని అకున్ సభర్వాల్ సహా ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు.

CM KCR serious review meeting on Drugs case with Akun Sabharwal

డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎంత మందికి నోటీసులు జారీ చేశారో, ఎంత మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారన్న వివరాలతో కూడిన డ్రగ్స్ రాకెట్ కేసు నివేదికను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో పలుశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

See Also: ఛార్మి తర్వాత ఇప్పుడు ఆ హీరోయినే

సమిష్టి కృషి చేయడం వల్లే వీటిని రూపుమాపవచ్చునని, నార్కోటిక్ సహాయంతో కేసు విచారణ సులువుగా మారుతుందని పోలీసులకు కేసీఆర్ సలహా ఇచ్చారు. అంతేగాక ఈ కేసు విచారణకు అవసరమైతే మరికొంత మంది పోలీసుల సహాయం తీసుకోవాలని అకున్ సభర్వాల్‌కు కేసీఆర్ సూచించారు.  ఈరోజు సాయంత్రానికి ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మహ్మద్ ఖద్దుస్, మహ్మద్ వాహిద్‌ల సిట్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటికే కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురిని అదుపులోకి ఎక్సైజ్‌ పోలీసులు విచారిస్తున్నారు.

See Also: పనిచేసిన ప్రచారం – సెలవులు రద్దు

పలువురు సినీ ప్రముఖులకు ఈ కేసులో నోటీసులు అందడంతో పాటు మరికొందరి పేర్లు వెలుగుచూస్తాయని కథనాలు ప్రచారం కావడంతో ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది. హైదరాబాద్‌లో పలు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులతో పాటు సినీ సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందినవారు డ్రగ్స్ కు బానిసైనట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తమ నివేదికలో పేర్కొంది. అంతేగాక పది రోజుల సెలవుపై వెళ్లాలన్న నిర్ణయాన్ని అకున్ సబర్వాల్ వెనక్కి తీసుకుని కేసు విచారణను వేగవంతం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ అధికారులు విచారించనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.