విద్యాసాగ‌ర్‌రావును ప‌రామ‌ర్శించిన కేసీఆర్

CM KCR visits Vidyasagar Rao at Continental Hospitals

CM KCR visits Vidyasagar Rao at Continental Hospitals

కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాష్ర్త ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్ రావును సీఎం కెసిఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, వైద్య చికిత్స విధానాన్ని గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఉదయం వెంటిలేటర్ తొలగించినప్పటికి కొద్దిసేపు స్వతహాగా శ్వాస తీసుకోగలిగారని వైద్యులు వివరించారు. ఇదే తరహాలో చికిత్సను కొనసాగిస్తామని కాంటినెంటల్ హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. చికిత్స అందుతున్న తీరు పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

శాయశక్తుల కృషి చేసి విద్యాసాగర్ రావు త్వరగా కోలుకునేలా చూడాలని కెసిఆర్ కోరారు. సీఎంతో పాటు ఎంపీలు వినోద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి , టి ఎస్ ఎం డి సి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు ప‌రామ‌ర్శించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.