కారు ప్రమాదంలో గాయపడ్డ డీకే అరుణ భర్త

Cogress MLA DK Aruna Husband Bharathsimhareddy met with an Accident

Cogress MLA DK Aruna Husband Bharathsimhareddy met with an Accident

కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణ భర్త భరత్‌సింహారెడ్డి ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ మండలంలోని ఎలిగెండ్ల గ్రామ స్టేజి వద్ద మూడు కార్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భరత్‌సింహారెడ్డి  ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు.

మక్తల్‌ నుండి మరికల్‌ వైపు భరతసింహారెడ్డి తన కారులో వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఇది జరుగుతున్నలోపే  మక్తల్‌ నుంచి మరికల్‌ వైపు వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి వెనుక నుంచి భరతసింహారెడ్డి వాహనాన్ని ఢీకొంది.

ఈ ప్రమాదంలో భరతసింహారెడ్డితో పాటు మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చికిత్సకోసం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఘటన తెలుసుకున్న డీకే అరుణ హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు బయల్దేరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.