రక్షకభటుడు సూపర్‌హిట్ అంటున్న బ్రహ్మానందం

రిచాప‌నై, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీ, స‌ప్త‌గిరి, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. ఈసినిమా చిత్రీకరణ పూర్తవడంతో ఈ సినిమా టీజర్ ని హోలీ సందర్భంగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

“ఈ చిత్ర నిర్మాత గురురాజ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నాతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు.ఇప్పుడు నిర్మాతగా మారి ‘రక్షక భటుడు’ సినిమా తీసాడు.ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. ఇలాగే వంద సినిమాలు నిర్మించే స్థాయికి గురురాజ్ ఎదగాలి. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ లిటరేచర్ ఫ్యామిలీ  నుంచి వచ్చినవాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.ఈ సినిమాలో నా పాత్రకు చాలా మంచి డైలాగులున్నాయి” అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చెప్పారు.

ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ – “నిన్ననే షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం. బ్రహ్మానందంగారు ఆశీర్వదించినట్టు గానే ఇకపై వరుసగా సినిమాలు నిర్మిస్తాను” అని తెలిపారు.

దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ – “ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కథాంశంతో ఈ సినిమా చేసాం. అవుట్ ఫుట్  అద్భుతం గా వచ్చింది. ముఖ్యం గా క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుంది” అని చెప్పారు.

ఇప్పటివరకూ తాను నటించిన సినిమాల కన్నా పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని , తెలుగు లో తనను నిలబెట్టే సినిమా అవుతుందని హీరోయిన్ రిచా పనై అన్నారు. టెక్నికల్ గా ఈ సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంటుందని కెమెరా మాన్ మల్హర్ భట్ జోషి అన్నారు.

సంగీతం : శేఖర్ చంద్ర, కళ: రాజీవ్ నాయర్ , ఎడిటింగ్: అమర్ రెడ్డి, ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్, నిర్మాత : ఎ .గురురాజ్, కథ- స్క్రీన్ ప్లై – మాటలు- దర్శకత్వం : వంశీ కృష్ణ ఆకెళ్ళ

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.