‘రివాల్వర్ రాజు’గా కమెడియన్ సప్తగిరి

Comedian Sapthagiri second crazy project as Revolver Raju

Comedian Sapthagiri second crazy project as Revolver Raju

కమెడియన్‌గా టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని హీరోగా అవతారమెత్తిన నటుడు సప్తగిరి. పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కేవలం కామెడీకే పరిమితంకాకుండా నవరసాల్ని పండిచగలనని సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో నిరూపించుకున్నాడు సప్తగిరి. హీరో అయిన తర్వాత కూడా కామెడీ పాత్రలు వదిలేయకుండా దూసుకెళ్తూనే హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

 

ప్రస్తుతం నాగచైతన్య, కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కమెడియన్‌గా నటిస్తూ తన మార్క్ కామెడీని పండించేందుకు రెడీ అవుతున్నాడు సప్తగిరి. ఈ సినిమాతోపాటు యంగ్ హీరోలు శర్వానంద్, నాగఅన్వేష్ చిత్రాల్లో సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నాడు. వీటితో పాటే హీరోగా తన రెండో సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘రివాల్వర్ రాజు’ అనే టైటిల్ ఫిక్స్ చేసామంటున్ననాడు సప్తగిరి. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని తెలియచేస్తామని సప్తగిరి అంటున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.