మళ్ళీ నవ్వించడానికి రెడీ అయిన డైరెక్టర్

అందరూ దొంగలే, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, మైఖేల్ మదన కామరాజు వంటి కామెడీ ఎంటర్‌టైన్మెంట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు నిధి ప్రసాద్. కామెడీ స్పెషలిస్ట్ అయిన ఈ దర్శకుడు కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యాడు.

సినిమాకు కథే బలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని తయారుచేసుకున్న స్క్రిప్ట్‌తో అంతా సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్లు అందరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ ‘ఊ’ను రెడీ చేసుకున్న దర్శకుడు నిధి ప్రసాద్ లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరో నాలుగు రోజుల్లో విడుదలకానుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.