ఆస్కార్ లో తప్పిదం

హైదరాబాద్: 89 వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరింగింది. ఎప్పటిలాగానే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేయగా అవార్డులు తీసుకున్నవారు మాత్రం చాలా సంతోషంగా వున్నారు. ఈ అవార్డుల వేడుకకు ట్రంప్ ఎఫెక్ట్ కూడా కొంత తాకింది. విదేశీ వలసలపై ట్రంప్ నిర్ణయం చాలా దేశాల వారిని బాధపెట్టింది. ఈ నేపధ్యంలో కొందరు ఈ అవార్డు వేడకకు హాజరు కాలేకపోయారు. ఇదిలా వుండగా ఆస్కార్ వేడుకల్లో ఓ భారీ తప్పిదం జరిగి ఆశ్చర్యానికి లోను చేసింది.

పెద్ద పెద్ద కార్యక్రమాల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లడం చాలా సాధారణమైన విషయం. అయితే 89 వ ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో చిన్నది కాదు ఓ పెద్ద పొరబాటే జరిగింది. బెస్ట్ ఫిల్మ్ ప్రకటన విషయంలో ఈ ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా మూన్ లైట్ ఎంపికయితే..పొరబాటున లాలా ల్యాండ్ చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు పొందినట్టు నిర్వాహకులు వారెన్ బెట్టీ, ఫాయె డనెవె తప్పుడు ప్రసంగం చేశారు.

లాలా ల్యాండ్ డైరెక్టర్, చిత్ర యూనిట్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ కూడా చేసారు. వారంతా స్టేజ్ పైకి చాలా ఆనందంగా వచ్చిన తరువాత గాని జరిగిన పొరపాటును వారు గుర్తించలేదు. విన్నర్స్ ని ఎనౌన్స్ చేసే కవర్ పై మూన్ లైట్ చిత్రం పేరు వున్నవిషయాన్ని గమనించారు జరిగిన మిస్టేక్ తెలిసి నాలుక్కరచుకుని సరైన కవర్ ను మూన్ లైట్ ప్రొడ్యూసర్లకు అందజేశారు. పాపం..లాలా ల్యాండ్ నిర్మాత జోర్డాన్ హోర్ విజ్ తన ట్రోఫీని మూన్ లైట్ స్టార్స్ కు అప్పగించక తప్పలేదు.

ఇదిలా వుంటే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ట్రంప్ సెగ తగిలింది. ఉత్తమ విదేశీభాష చిత్రంగా నిలిచిన ఇరానియన్ సినిమా ‘ద సేల్స్‌మెన్‌’ సినిమా డైరెక్టర్ అస్ఘర్ ఫర్హది ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించారు.

ట్రంప్‌ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని, జాతుల మధ్య చిచ్చులు పెడుతున్నాడని.. అందుకే ఈ కార్యక్రమానికి రాలేదని డైరెక్టర్ ఫర్హది పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.