సత్తా చూపించిన జగ్గారెడ్డి

Congress Jagga Reddy auctioned his gold bracelet gifted by VH for Mirchi farmers

రాహుల్‌గాంధీని సంగారెడ్డికి తీసుకొచ్చి భారీ ఎత్తున బహిరంగసభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడ్డారు. సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు తనకు ప్రేమగా బహుకరించిన బంగారపు బ్రాస్‌లెట్‌ను వేలం వేశారు.

Congress Jagga Reddy auctioned his gold bracelet gifted by VH for Mirchi farmers

సంగారెడ్డిలో సభ జరిగిన రోజు రాహుల్‌గాంధీ సూచనలమేరకు జగ్గారెడ్డికి తన బ్రాస్‌లెట్‌ని వీహెచ్ బహూకరించారు. అయితే వీహెచ్ ఇచ్చిన బ్రాస్‌లేట్‌ని వేవం వేసి వేలం ద్వారా వచ్చిన  డబ్బులను ఖమ్మం మిర్చి రైతులకు అందిస్తానని చెప్పారు. దానికి తగ్గట్లుగానే సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌లో శుక్రవారం ఈ వేలంపాట నిర్వహించారు.  కృషి బిల్డర్స్‌కు చెందిన మహేందర్‌ రెడ్డి  20 లక్షల రూపాయలకు దీన్ని సొంతం చేసుకున్నారు.

20 లక్షల రూపాయలను ఖమ్మంలో అరెస్ట్‌ అయిన 11 మంది మిర్చి రైతులకు తలా ఓ లక్ష, వరంగల్‌ జిల్లా రైతులకు మరో 9 లక్షల రూపాయలు ఇస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.