మాట్లాడనందుకు కేసీఆర్ సిగ్గుపడాలి: జీవన్ రెడ్డి

Congress MLA Jeevan Reddy criticize CM KCR for not addressing in OU Centenary Meeting

Congress MLA Jeevan Reddy criticize CM KCR for not addressing in OU Centenary Meeting

తెలంగాణా రాష్ట్రానికే వన్నె తెచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగించకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమాల్లో తెలంగాణా ఉద్యమానికి పురిటిగడ్డలాంటి ఉస్మానియా యూనివర్సిటీ గురించి ముఖ్యమంత్రి , గవర్నర్‌లు మాట్లాడకపోవడం ఇప్పుడు పెద్ద దుమారానికి కారణం అవుతోంది.

ఓయూ గొప్పదనం, విద్యార్థుల త్యాగాల గురించి మాట్లాడనందుకు కేసీఆర్ సిగ్గుపడాలని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థులంటే కేసీఆర్‌ ఎంత భయపడుతున్నారో అర్థమవుతోందని జీవన్‌రెడ్డి చెప్పారు. మూడేళ్ల తర్వాత ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ మూగోడిగా వెనుదిరిగారని జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వ్యతిరేకత ఉందో అర్థమౌతోందని జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.