కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత

Congress MP Palvai Govardhan Reddy passes away

Congress MP Palvai Govardhan Reddy passes away

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి (81) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశం కోసం ఆయన కులుమనాలి వెళ్లారు. అక్కడ కారలో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఆయన భౌతికకాయాన్ని కులుమనాలి నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాల్వయి ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ సంతాపం తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.