కెటిఆర్ నాలుక చీరేస్తానన్న మాజీ కేంద్రమంత్రి

Congress seniors hit back at KTR and did sensational comments

Congress seniors hit back at KTR and did sensational comments

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ప్రభుత్వంలో యమ యాక్టివ్‌గా ఉంటూ ముఖ్యమంత్రికి చేదోడువాదోడుగా ఉంటున్న మంత్రి కెటిఆర్‌ నాలుక చీరేస్తానని అంటున్నారు ఓ మాజీ కేంద్రమంత్రి. తెలంగాణా ఏర్పడ్డ తర్వాత కొన్ని రోజులు కామ్ గా ఉన్న కెటిఆర్ ఈమధ్య కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడుతున్నారు.

ఈమధ్య తెలంగాణావ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్న జనహితం కార్యక్రమంలోనూ కెటిఆర్ తెలంగాణాకు కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు ఏం చేసిందని ప్రశ్నించడమేకాకుండా నాయకులను ఘాటుగానే విమర్శిస్తున్నారు.

దీంతో ఇన్నిరోజులు కెటిఆర్‌తోపాటు ఇతర టీఆర్‌ఎస్ నాయకుల విమర్శలకు సమాధానాలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఈసారి డోస్ పెంచారు. ఈసారి ఏకంగా మాజీకేంద్రమంత్రి తనదైన స్టైల్లో కెటీఆర్‌ను దుయ్యబట్టారు.

సికింద్రాబాద్‌ గాంధీనగర్‌పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అంతకుముందు ధ‌ర్నాచౌక్‌ను త‌ర‌లించటాన్ని ఆపాలంటూ ఆందోళ‌న‌కు దిగారు. ” నీ అయ్య‌ కాంగ్రేస్ నుంచే వ‌చ్చిండూ.. నీ అయ్య‌ గ‌లీజోడైతే ఆయ‌న‌కు పుట్టిన‌ నీవు గ‌లీజోడివే కెటీఆర్ ..ఒళ్ళు ద‌గ్గ‌ర‌ పెట్టుకుని మాట్లాడు.లేదంటే నాలుక‌ చీరేస్తాం.. అంతేగాక కాంగ్రేస్ పార్టీని విమ‌ర్శించే స్థాయి నీకు లేదు మా ముందు చెడ్డీలేసుకున్న‌ వాడివి..మీ పార్టీని బొంద‌ పెట్టే రోజులు ద‌గ్గ‌ర‌ ప‌డ్డాయ‌ని” ఘాటుగా విమర్శించారు మాజీ కేంద్ర‌ మంత్రి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌.

Have something to add? Share it in the comments

Your email address will not be published.