అజ్ఞాతంలోకి రాహుల్‌గాంధీ

congress-vice-president-rahul-gandhi-being-arrested-in-mandsaur-madhya-pradesh

congress-vice-president-rahul-gandhi-being-arrested-in-mandsaur-madhya-pradesh

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మధ్యప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని అజ్ఞాతంలోకి తీసుకెళ్ళారు. రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

నీముచ్‌ ప్రాంతంలో పోలీసులు రాహుల్‌ను చుట్టుముట్టి అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, కమల్‌నాథ్‌, జేడీయూ నేత శరద్‌యాదవ్‌, సచిన్‌ పైలెట్‌లను బస్సులో నీముచ్‌లోని విక్రం సిమెంట్‌ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. మంద్‌సౌర్ ప్రాంతంలో రాజకీయ నాయకుల పర్యటనలపై నిషేదం విధించిన అధికారులు ఇప్పటికే రాహుల్‌ పర్యటనకు రెండుసార్లు అభ్యంతరం తెలిపారు.

అయితే తన పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా.. వారి కళ్లుగప్పి ఎలాగైనా మంద్‌సౌర్‌కు చేరుకొని.. రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపాలని రాహుల్‌ భావించారు. అందులోభాగంగా ఉదయ్‌పూర్‌ వద్ద కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రదేశమంతా పోలీసులు ఉండటంతో రాహుల్‌ వెంటనే ద్విచక్రవాహనంపై మాందసౌర్‌ వెళ్లేందుకు బయలుదేరారు.

పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు, విలేకర్లు, పోలీసులు కొద్ది దూరం పాటు రాహుల్‌ బైక్‌ వెనుక వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల సహాయంతో మంద్‌సౌర్‌కు చేరుకుంటుండగా మార్గమధ్యంలో పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మంద్‌సౌర్‌లో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతిచెందారు. పోలీసుల కాల్పుల వల్లే రైతులు చనిపోయారంటూ మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ‘నేను రైతులను కలవాలి. ప్రధాని మోదీ రైతులకు రుణమాఫీ చేయడం లేదు’ అంటూ రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.