ప్రత్యేకహోదాపై అట్టుడుకిన రాజ్యసభ

Congress YSRCP MPs demanded for special status to AP in Rajyasabha

Congress YSRCP MPs demanded for special status to AP in Rajyasabha

ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి రాజ్యసభలో తమ గళాన్ని విప్పారు వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసారు ఎంపీలు. తెలుగుదేశం ఎంపీలు మాత్రం ఈ చర్చలో పాాల్గొనకుండా డుమ్మాకొట్టారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు బిజెపి టిడిపిల ఎన్డీఏ మోసం రాజ్యసభ సాక్షిగా బయటపడిందని విమర్శించారు ప్రతిపక్ష ఎంపీలు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు అవాస్తవాలు, అబద్ధాలు చెబుతూ కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు ఎంపీ కెవిపీ. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందిన సాయం చాలా తక్కువని, ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు కుమ్మక్కై ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా చేస్తున్నారని ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు.

కాంగ్రెస్ ఎంపీలు గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, రాపోలు ఆనంద్ భాస్కర్, జైరాం రమేష్‌లు చర్చలో మాట్లాడుతూ జీఎస్టీ, ఆధార్ లను అమలు చేస్తున్న కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతుందని విమర్శించారు. హోదా ఇవ్వడానికి 14వ ఆర్ధిక సంఘాన్ని బూచిగా చూపిస్తున్నారని అన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు తేడా లేదని అనడం సరికాదని చెప్పారు. ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాకుండా పదేళ్ల పాటు  ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఆయనే ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక సాయమని మాట మార్చారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.

 

ఎన్నికల సమయంలో తిరుపతిలో మేం అధికారం లోకి వస్తున్నాం 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ని నమ్మి ప్రజలు ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని సభ సాక్షిగా ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడి ఉందని అన్నారు. అయితే ఎంపీల ప్రశ్నలకు స్పందించిన కేంద్ర సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ సమాధానంతో సంతృప్తి చెందని ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

అయితే తెలుగుదేశం ఎంపీలు ఈ చర్చలో పాల్గొనకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.