పహిల్వాన్ నిర్దోషి – నలుగురికి పదేళ్ళ జైలు

Court declares Mohammed Pahelwan innocent in MIM MLA Akbaruddin Owaisi Murder Attack

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నలుగురు నిందితులు సలీం బిన్‌, అబ్దుల్లా, అవద్‌, హసన్‌ బిన్‌‌లను నాంపల్లిలోని 7వ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు దోషులుగా తేల్చింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు  మహ్మద్ పహిల్వాన్‌పై న్యాయస్థానం కేసు కొట్టివేసి అతణ్ణి నిర్దోషిగా ప్రకటించింది. పహిల్వాన్‌‌తో సహా పదిమంది నిందితులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. అయితే నలుగురు నిందితులకు మాత్రం పదేళ్ళ జైలు శిక్ష విధించింది.

Court declares Mohammed Pahelwan innocent in MIM MLA Akbaruddin Owaisi Murder Attack

2009 ఎన్నికల్లో మహ్మద్ పహిల్వాన్ తన ప్రత్యర్థి ఎంబీటీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచే తనపై కక్ష్య పెంచుకొని చంపుతామని బెదిరించారని, పహిల్వాన్, మునావర్ ఇక్బాల్‌లు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నట్లుగా అక్బరుద్దీన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. అందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులకు అదేశించానని, 2011 ఏప్రిల్ 13న గుర్రంచెరువు కట్ట ప్రాంతంలో స్థానిక ఆర్‌ఐతో కలిసి అక్రమ నిర్మాణాలను పరిశీలించి వస్తుండగా యూనుస్ బిన్ ఓమర్ యాఫై ఆయన కుమారుడు ఈసా బిన్ యూనుస్ యాఫైలు తన వాహనాన్ని ఆపారని అక్బరుద్దీన్ కోర్టుకు తెలిపారు.

తనతో వాగ్వాదానికి దిగి చంపుతామని బెదిరించారని, పహిల్వాన్ గ్యాంగ్ అక్రమాలను అడ్డుకుంటున్నాననే కక్ష్యతోనే తనను చంపి అడ్డుతొలగించుకోవాలని భావించారన్నారు. ఇందులో భాగంగానే 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్‌-బాలాపూర్‌ రోడ్డులో కత్తులు, తుపాకులు, క్రికెట్ బ్యాట్‌తో తనపై దాడి చేశారని, ఈ దాడిలో అనేకచోట్ల కత్తులతో పొడిచారని చెప్పారు. ఈ దాడిలో తనకు బుల్లెట్ గాయాలయ్యాయని చెప్పారు.

See Also: మీడియాపై కెటిఆర్ గరం – తెలంగాణా ఇమేజ్‌ను దెబ్బతీయకండి

2011 ఏఫ్రిల్ 30న అక్బరుద్దీన్ పై దాడి జరగడంతో పాతబస్తీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మూడు బుల్లెట్లు శరీరంలో ఉండగా.. 5 కత్తిపోట్లు బలంగా దిగాయి. దాడి జరిగిన సమయంలో గన్‌మెన్ జానీ మియా జరిపిన కాల్పుల్లో ఇబ్రహీం అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అవద్, అబ్దుల్లాలు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రధాన నింధితుడు మహ్మద్ ఫహిల్మాన్ సహా మరో 12 మంది నిందితులను విచారించిన కోర్టు అక్బర్ దాడిలో ఉపయోగించిన రివాల్వర్లను, కత్తులను గుర్తించారు. పహిల్వాన్ తరుపున సినియర్ న్యాయవాది గురు రాఘవేంద్ర , ప్రభుత్వం తరుపున న్యాయవాది వినోద్ వాదనలు వినిపించారు. హత్యాయత్నం, ఆర్మ్స్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.

అక్బరుద్దీన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో మొత్తం 13 మంది నిందితులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 19 మంది సాక్ష్యులను విచారించింది నాంపల్లి కోర్టు. అక్బరుద్దీన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆరేళ్ల తరువాత అక్బరుద్దీన్ హత్యయత్నం కేసులో సుదీర్ఘ వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ఓవైసీ కేసులో నలుగురు దోషులకు నాంపల్లి కోర్టు శిక్షలు ఖరారు చేసింది. పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దోషులు ఇప్పటికే అనుభవించిన ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు మినహాయించింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో ఏ-2 హసన్, ఏ-3 అబ్దుల్లా, ఏ-5 వాహిద్, ఏ-12 వహ్లాన్‌లను దోషులుగా పేర్కొంటూ తీర్పును వెలువరించిన కోర్టు..ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహ్మద్ పహిల్వాన్‌ను నిర్దోషిగా తేల్చి చెప్పింది.

See Also: అపర చాణక్యుడికి ఈయేడాదైనా గౌరవం దక్కేనా??

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.