ధోని స్టంపింగ్ కంటే వేగంగా మాల్యాకు బెయిల్

Virender Sehwag satirical comments on Vijay Mallya arrest bail and government

Virender Sehwag satirical comments on Vijay Mallya arrest bail and government

వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌లో ఈ పేరు తెలియని వారుండరు. అయితే క్రికెట్‌ ఆడినన్ని రోజులు ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన వీరూ క్రికెట్ నుండి బయటికి వచ్చిన ట్వీట్ల వర్షంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆమధ్య ఓ అమ్మాయికి ట్విట్టర్‌లో క్లాస్ పీకిన వీరూ ఈరోజు జరిగిన పరిణామాలపై అంతే వేగంగా స్పందించాడు. మనదేశంలో బ్యాంకులకు పన్ను ఎగ్గొట్టి లండన్‌లో దాక్కొన్న లిక్కర్‌ డాన్ విజయ్‌మాల్యా అరెస్ట్ ఆ తర్వాత మూడు గ్టల్లో బెయిల్ వచ్చిన విషయంపై వీరూ తనదైన స్టైల్లో ట్వీట్ వేశాడు.

‘ధోని స్టంపింగ్‌ కంటే వేగంగా విజయ్‌ మాల్యాకు బెయిల్‌ లభించింది’ అంటూ వీరేంద్రు సెహ్వాగ్ ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు. అంతేగాక మనదేశంలో రైతులు రుణాలను చెల్లించపోతే వారిని వెంటనే అరెస్టు చేస్తారని.. విజయ్‌మాల్యాను ఏడాది తర్వాత అరెస్టు చేసి వెంటనే బెయిల్‌ మంజూరు చేశారని విమర్శించాడు వీరూ.

Have something to add? Share it in the comments

Your email address will not be published.