తగ్గనున్నపెట్రోల్ ధరలు

Crude oil prices may fall in near future Petrol Prices decreased

Crude oil prices may fall in near future Petrol Prices decreased

పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది నెలలుగా పెరుగుతూ వచ్చిన ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. అమెరికాలో కొత్త చమురు క్షేత్రాల అన్వేషణ అంచనాలకు మించి అధికంగా ఉందని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో క్రూడాయిల్ ధర 50 డాలర్ల దిగువకు పడిపోయింది.

అమెరికాలో చమురు నిల్వలు మరో 50 లక్షల బ్యారళ్లు పెరిగినట్టు ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించడంతో కొనుగోళ్లు మందగించాయని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఉత్పత్తి పెరుగుతుండటంతో, పతనమవుతున్న ధరలను నిలపాలంటే, ఒపెక్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వుందని అన్నారు. కాగా, ప్రస్తుతం మేలో డెలివరీ అయ్యే బ్యారల్ క్రూడాయిల్ ధర 49.71 డాలర్లుగా ఉంది.

నవంబర్ 30 తరువాత ముడి చమురు ధర ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ ప్రభావంతో భారత క్రూడ్ బాస్కెట్ ధర కూడా తగ్గనుండటంతో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశాలున్నాయి.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.