చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి: పురంధ్రీశ్వరి

Daggubati Purandreshwari fires on AP CM Chandrababu Naidu in Sand issue

Daggubati Purandreshwari fires on AP CM Chandrababu Naidu in Sand issue

ఇసుక తవ్వకాల గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం సరికాదని హితవు పలికారు మాజీ కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో 16మంది మృతి చెందడం బాధాకరమన్న ఆమె ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలనిసూచించారు.

అంతేగాక ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోందని, అన్ని నదులను మాఫియా తవ్వేస్తోందని పురంధ్రీశ్వరి అన్నారు. ఓ వైపు ఉచిత ఇసుక అంటున్నారని, మరోవైపు లారీలతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు మాజీ కేంద్రమంత్రి మరోవైపు ఇసుక మాఫియా కట్టడి, ఇసుక విధానంపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.